అత్త ముక్కు…..తండ్రి చెవి..! కొరికి కోసేశాడు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

డబ్బు మనుషులని ఎంతగా మారుస్తుందంటే సొంత వారిపై కుడా దాడి చేయడానికి ప్రేరేపిస్తుంది. మనిషిని రాక్షసుడిలా మారుస్తుంది. ఆడపిల్లని లక్ష్మి దేవిలా కొలిచె సంప్రదాయం కలిగిన దేశం మనది, అలాంటి దేశంలో నేడు కట్నం కోసం అదే ఆడపిల్లని వేధిస్తున్నారు, క్షోభ కి గురి చేస్తున్నారు…కిరాతకంగా చంపేస్తున్నారు. ఈ డబ్బు మైకంలో కొన్ని సార్లు మనుషులు వింతగా ప్రవర్తిస్తున్నారు భార్యలనే కాకుండా భార్యల తల్లి తండ్రు ల పైనూ దాడులు చేస్తున్నారు. ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో చోటు చేసుకుంది. ఓ దురుసు అల్లుడు వర కట్నం అనే పిచ్చి లో తన సొంత అత్తా సొంత తండ్రి పైనే దాడి చేసాడు..! వాళ్ళ ముక్కు చెవులు కొరికి కోసేసాడు..!

వివరాల్లోకి వెళితే.. బరేలీకి చెందిన చాంద్‌బీ అనే యువతికి ఏడాది క్రితం మహమ్మద్ అష్వక్ అనే వ్యక్తితో పెళ్లయింది. పెళ్లి సమయంలో రూ.10లక్షలు కట్నం కింద ఇచ్చారు. కొన్నాళ్లు సాఫీగానే సాగిన కాపురంలో అదనపు కట్నం చిచ్చు మొదలైంది. మరో రూ.5లక్షలు అదనపు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టాడు. ఇక విషయం తెలుసుకున్న అత్తా మామలు మందలించడానికి ఇంటికొస్తే… కోపంతో అత్త మీద పడి ముక్కను కొరికేశాడు. ఇంతలోనే అతని తండ్రి ఇజార్ గుల్షన్‌పై దాడి చేసి చెవిని కోసేశాడు. ఆపై అక్కడినుంచి పరారయ్యారు. రక్తస్రావంతో గుల్షన్ స్పృతహ కోల్పోవడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Share.

Comments are closed.

%d bloggers like this: