సినిమా ఇక్కడిది మార్కెట్ టార్గెట్ అంతటిది..!

Google+ Pinterest LinkedIn Tumblr +

హీరో ప్రభాస్ రెంజే వేరు..! బాహుబలి సినిమాతో ఆయన రేంజ్ ఆయన గ్రాఫ్ చాలా పెరిగిపోయింది. అంతటి సినిమా చేసి అంతటి హిట్ అందుకున్నాడు కాబట్టి ఆయన ఫ్యాన్స్ కూడా అదే స్థాయి సినిమాని ఆయన నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక బాహుబలి సినిమాతో ఆయనకి దేశవ్యాప్తంగా మార్కెట్ పెరిగిపోయింది. మార్కెట్ పెరిగింది కాబట్టి ప్రభాస్ ప్రస్తుతం బాలీవుడ్ మార్కెట్ పైనే ఎక్కువగా కాన్సెంట్రేట్ చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. బాహుబలి సినిమా తరువాత వస్తున్న సాహో సినిమాకి ప్రొడక్షన్ ఖర్చు అక్షరాల 300 కోట్లు. భారీ యాక్షన్ సన్నివేశాలు భారీ సెట్స్ మనకి ట్రైలర్ లో కనిపించాయి ఇంత భారీగా రూపొందించిన సినిమా కాబట్టి భారీగా వాసుల్లనే రాబట్టాలని చూస్తున్నారు నిర్మాతలు.

బాలీవుడ్ మార్కెట్ పై ప్రభాస్ ఎక్కువగా కాన్సెంట్రేట్ చేస్తున్నాడు అనడంలో అతిశెయోక్తి ఏమి లేదు. ఎందుకంటే ఈ సినిమాలోని క్యాస్ట్ ని మరి ఇతర అంశాలని చూస్తుంటే ఎక్కువగా బాలీవుడ్ అభిమానులని బాలీవుడ్ మార్కెట్ నే తన టార్గెట్ గా చేసుకునట్టు అర్ధమవుతుంది. సాహో లోని పాటలకి చాలా మటుకు బాలీవుడ్ సింగర్లనే ఎంచుకున్నారు మరోపక్క సినిమాలోని ముఖ్య పాత్రలన్నీ కూడా బాలీవుడ్ నటులే కథానాయిక పాత్రలో బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ ప్రతి నాయకుడి పాత్రలో మంచి గుర్తింపు ఉన్న నటుడు జాకీ ష్రాఫ్ కనపడనున్నారు. ఇక ఇతర పాత్రల్లో బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముకేష్, మహేష్ మాంజ్రేకర్, చుంకి పాండే, మందిర బేడి లు కనపడనున్నారు.

సినిమా ప్రమోషన్స్ విషయానికొస్తే బాలీవుడ్ ప్రముఖ ప్రసారాలలో ముంబై నగరంలో ప్రభాస్ శ్రద్ధా లు తెగ హల్ చల్ చేసేశారు. ఇవన్నీ చూస్తుంటే మార్కెట్ పై ప్రభాస్ బాగానే కాన్సెంట్రేట్ చేశాడు అని అర్ధం అయిపోతుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీసర్ పాటలకి అద్భుతంగా రెస్పాన్స్ లభిస్తుంది టికెట్లకోసం ఎదురుచూస్తున్న అభిమానులకి టికెట్లు దొరకడమే కష్టంగా మారిపోయింది. ఇక ఈ సినిమా ఆగస్ట్ 30వ తేదీ నాడు ప్రేక్షకులముందుకి రానుంది. మరి సాహో సినిమా ప్రేక్షకులని ఎంతగా అలరిస్తుందో వేచి చూడాలి.

Share.

Comments are closed.

%d bloggers like this: