మీకు శిక్ష పడేదాకా పోరాడతా..!

Google+ Pinterest LinkedIn Tumblr +

నటి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత విజయశాంతి టీ‌ఆర్‌ఎస్ పార్టీ పై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై విమర్శలు గుప్పించారు. ఆధికారాన్ని దుర్వినియోగం చేసినందుకు చేసిన తప్పులకి శిక్ష తపదన్నారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఇక పనిచేయవని, అధికార బలాన్ని దుర్వినియోగపరిచి వారు చేసిన తప్పులకి సీబీఐ విచారణ ని ఎదుర్కునే పరిస్థితి వచ్చింది అని ఆమె అన్నారు. చేసిన తప్పులకి సీబీఐ విచారణ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని టీఆర్ఎస్ నేతలకు ఆమె సూచించారు.

ఈ దఫా టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత టీఆర్ఎస్ హైకమాండ్‌లో మార్పు కనిపిస్తోందని ఈ విషయాన్ని స్వయానా ఆ పార్టీ అగ్రనేత, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏ చెప్పినట్టు వార్తలు వస్తున్నాయని ఆమె చెప్పుకొచ్చారు. సీబీఐ విచారణ పేరుతో బీజేపీ నేతలు చేస్తున్న హెచ్చరికలతో కేటీఆర్‌కు దిక్కుతోచడం లేదని, అందుకనే ఆయనకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా కనిపిస్తోందని ఆమె అన్నారు. కాంగ్రెస్ వారికి ప్రత్యామ్నాయంగా కనిపిస్తుంది అని వారు చేస్తున్న వ్యాఖ్యలని మానుకోవాలని వాళ్ళకి అదే బెటర్ అని ఆమె సూచించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న తప్పులకి వాళ్ళకి తగిన శిక్ష పడే వరకు పోరాడుతామని ఆమె హెచ్చరించారు. బీజేపీ బెదిరిస్తే కాంగ్రెస్‌ను నిర్వీర్యం చేయడం, వారు బలపడితే కాంగ్రెస్సే ప్రత్యామ్నాయమంటూ ప్రకటనలు చేయడం టీఆర్ఎస్ వైఖరికి నిదర్శనమని విజయశాంతి విరుచుకపడ్డారు.

Share.

Comments are closed.

%d bloggers like this: