‘ప్రభాస్’ మల్టీప్లెక్స్..! పూర్తి వివరాలు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

భారీ బడ్జెట్ తో నిర్మించిన సాహో సినిమా విడుదలకి పూర్తిగా సిద్ధం అయ్యింది. భారీ యాక్షన్ సన్నివేశాలతో రేపే ప్రభాస్ సహో తో ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. ఇకపోతే ప్రభాస్ కి రేపు చాలా ముఖ్యమైన రోజు తన సినిమానే కాదు రేపు ప్రభాస్ మల్టీప్లెక్స్ కూడా ఓపెన్ అవ్వబోతుంది. అవును మీరు వింటున్నది నిజమే ప్రభాస్ ఏంటి.. మల్టీప్లెక్స్ ఏంటి..? అనుకుంటున్నారా..? హీరో ప్రభాస్ ఇప్పుడు సినిమాల పైనే కాదు బిజినెస్ పై కూడా కాన్సెస్ట్రేట్ చేస్తున్నాడు. యు.వి.క్రియేషన్స్‌ అధినేతల్లో ఒకరైన వేమారెడ్డి వంశీ తో పార్ట్‌నర్ షిప్‌లో ఒక భారీ మల్టీప్లెక్స్ ని ప్రభాస్ నిర్మించారు. ఆ మల్టీప్లెక్స్ రేపే ప్రారంభం కానుంది.

వివరాల్లోకి వెళితే.. యు.వి.క్రియేషన్స్‌ అధినేతల్లో ఒకరైన వేమారెడ్డి వంశీ రెబెల్ స్టార్ ప్రభాస్ లు కలిసి ఒక భారీ మల్టీప్లెక్స్ ని ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా సూళ్లురు పేటలో నిర్మించారు. ‘వి ఎపిక్’ అనే పేరు తో ఈ మల్టీప్లెక్స్ ప్రారంభం కానుంది. ఈ మల్టీప్లెక్స్ కి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి, ‘వి ఎపిక్’ ఆసియా ఖండంలోనే అతి పెద్ద స్క్రీన్ ఉన్న థియేటర్‌గా గుర్తింపు పొందనుంది. ఈ మల్టీప్లెక్స్‌లో మూడు థియేటర్స్ ఉన్నాయి. అందులో ఒకటి 102.6 అడుగుల వెడల్పు, 56 అడుగుల ఎత్తుతో ఈ థియేటర్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతి పెద్ద సిల్వర్ స్క్రీన్స్‌లో ఇది మూడోది. ఇక మన దేశంతో పాటు ఆసియా ఖండంలోనే ఇదే అతి పెద్ద సిల్వర్ స్క్రీన్. ఈ మల్లీప్లెక్స్‌లో 647 సీట్ల కెపాసిటీతో ఓ థియేటర్. 140 సీట్ల కెపాసిటీతో రెండు థియేటర్స్ నిర్మించారు. ఇక ఈ మల్టీప్లెక్స్ ని మన యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తన చేతుల మిడిగా రేపు సాహో చిత్రంతో ప్రారంభించనున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: