సాహో.. పర్ఫెక్ట్ రివ్యూ..! హిట్టా..? ఫట్టా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

రెబెల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా తరువాత రెండేళ్లుగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా సాహో. భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా అద్భుతమైన విసువల్ ఎఫెక్ట్స్ తో అబ్బురపరిచే యాక్షన్ సన్నివేశాలతో నేడు ప్రేక్షకుల ముందుకి రానుంది. రన్ రాజా రన్ డైరెక్టర్ సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం చేశారు, కథానాయికగా శ్రద్ధా కపూర్, ముఖ్య పాత్రల్లో జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముకేష్, చుంకి పాండే, మందిరా బేడిలు నటించారు. ఇక ఇప్పటికే విడుదలయిన బెనిఫిట్ షోతో సినిమా మంచి రెస్పాన్స్ నే దక్కించుకుంటుంది. మరి ప్రభాస్ తన ప్రేక్షకుల అంచనాలకి తగిన న్యాయం చేశాడా అనేదే ఇప్పుడు హాట్ టాపిక్..

ఈ సినిమా విషయానికొస్తే యంగ్ డైరెక్టర్ సుజీత్ ప్రభాస్ ఫ్యాన్స్ ఊహించిన రీతిలో డైరెక్ట్ చేయలేకపోయాడు అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.. ఫస్ట్ హాల్ఫ్ లో సినిమా సాఫీగానే సాగినప్పటికి అసలైన సినిమా అంతా సెకండ్ హాఫ్ లోనే ఉంటుంది. ప్రభాస్ తన పెర్ఫామెన్స్ తో ఫ్యాన్స్ మనసులు దోచుకున్నాడు అనే చెప్పాలి యాక్షన్ సీన్స్ కి పూర్తి న్యాయం చేశాడు. శ్రద్ధా కూడా తన పాత్ర కి తగిన న్యాయం చేసింది అనే చెప్పొచ్చు. విలన్ పాత్రలో చుంకి పాండే తన మ్యానరిసంతో అద్భుతంగా నటించాడు.. చుంకి పాండే విలన్ పాత్రకి ప్రభాస్ హైప్ కి సరిగ్గా సరిపోయాడు అని టాక్ వస్తుంది. క్లిమాక్స్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతారు! క్రిటిక్స్ సైతం నటీనటుల ప్రదర్శనని మెచ్చుకుంటున్నారు.

ప్లస్ పాయింట్స్ :

• ప్రభాస్ నటన
• చుంకి పాండే విలన్ పాత్ర
• యాక్షన్ సన్నివేశాలు
• చేసింగ్ సీన్
• క్లిమాక్స్
• బీజీఏం

మైనస్ పాయింట్స్ :

• స్క్రీన్ ప్లే
• సీన్స్ మధ్య కనెక్షన్
• తేలిక పాటి డైరెక్షన్ లోపం
• సాంగ్స్
• సినిమా అక్కడక్కడా ల్యాగ్ అవ్వడం.

మొత్తానికి బెనిఫిట్ షో తో ఫ్యాన్స్ మాత్రం సంతృప్తిగానే ఉన్నట్టు అర్ధం అవుతుంది. యాక్షన్ సీన్స్ ని ఇష్టపడే వాళ్ళకి ప్రభాస్ మంచి సినిమానే ఇచ్చాడు అని చెప్పొచ్చు. ఈ సినిమాకి 10 లో 7 మార్కులు ఇవ్వచ్చు అని క్రిటిక్స్ అంటున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: