చిల్లర వార్తలొద్దు..పూర్తిగా వినండి..! ఈటల సంచలన వ్యాఖ్యలు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

తెరాస పార్టీ సీనియర్ నాయకుడు హుజూరాబాద ఎమ్మెల్యే తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ హుజూరాబాద్ కార్యకర్తల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆయన చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కలకాలంగా మారాయి. ‘మంత్రి పదవి నాకు ఎవరో పెట్టిన బిక్ష కాదు’ అని ఆయన చేసిన వ్యాఖ్యాలే ఇందుకు కారణం.. ఒక్కసారిగా ఈయన చేసిన వ్యాఖ్యలపై ప్రాధాన్యత సంతరించుకోవడంతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంత్రి ఈటల కి ఫోన్ చేసి వివరణ కోరినట్టుగా సమాచారం.

దీంతో ఈతల నిన్న రాత్రి తన వ్యాఖ్యలపై వివరణ తెలుపుతూ ప్రకటన విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. “నేను గులాబీ సైనికుడిని. మా నాయ‌కుడు ముఖ్య‌మంత్రి కేసీఆర్‌. రాబోయే మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ముమ్మాటికీ గులాబీ జెండానే ఎగురుతుంది. నేను పార్టీలో చేరిన‌నాటి నుంచి.. నేటి వ‌ర‌కు గులాబీసైనికుడినే. మా నాయ‌కుడు ముఖ్య‌మంత్రి కేసీఆర్ గారే”. “ఇటీవ‌ల కాలంలో కొన్ని వార్త‌ప‌త్రిక‌లలో, సోష‌ల్ మీడియాలో మా పార్టీ అంటే గిట్ట‌నివాళ్లు, నా ఎదుగుద‌ల‌ను ఓర్వ‌లేనివారు త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నారు. నేను ఒక కులానికి ప్ర‌తినిధిని అన్న‌ట్టు, డ‌బ్బుల‌కు ఆశ‌ప‌డే వ్య‌క్తిగా చిత్రీక‌రించే ప్ర‌య‌త్నం చేశారు. ఈ నేప‌థ్యంలోనే నేను ఈ రోజు హుజురాబాద్‌లో మాట్లాడాను” అని అన్నారు.

చిల్లర వార్తలు వద్దు..! లేనిది ఉన్నట్టుగా చిత్రీకరించకండి. హుజూరాబాద్ కి నన్ను పంపించింది మా నాయకుడే… ఉద్యమం లో చేరినది డబ్బు సంపాదించడానికి కాదు. ఉద్యమంలో పోరాటం చేయడానికి..! గులాబీ సైనికుడిగా మారడానికి. ఉద్యమం లో పోరాడినందుకే నా ప్రజలు నన్ను ఇంకా గుర్ట్ పడుతున్నారు గెలిపిస్తున్నారు అని ఆయన వెల్లడించారు. వార్తలు ముద్రించేతప్పుడు పూర్తిగా విని రాయాలని ఆయన మీడియాకి తెలియజేశారు.

Share.

Comments are closed.

%d bloggers like this: