ఖబర్దార్ రేవంత్ రెడ్డి.. చెమటలు పట్టిస్తాము..!

Google+ Pinterest LinkedIn Tumblr +

జెన్‌కో ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్‌రావు పై కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంపీ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు విధ్యుత్ శాఖ అధికారులు సిబ్బంధి మండిపడ్డారు. ప్రభాకర్‌రావును అమరవీరుల స్థూపం వద్ద నిలబెట్టి కాల్చినా తప్పులేదంటూ మీడియా సమావేశంలో రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను వాళ్ళు ఖండించారు. ప్రబాకర్ రావు పై విమర్శలు చేసినందుకు రేవంత్ రెడ్డి పై విద్యుత్ సంఘాలు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఈ సంధర్భంగా గురువారం ఖైరతాబాద్‌లోని విద్యుత్‌సౌధలో 25 సంఘాలు భారీ ధర్నా నిర్వహించాయి.

దార్నాలో పాల్గొన్న సభ్యులు మాట్లాడుతూ.. ఓటుకు నోటు కేసులో దొంగ రేవంత్ రెడ్డి ఖబర్దార్..! మా సీఎండీనే కాల్చేస్తానంటూన్నావు మేము మొత్తం 70 వేల మండి ఉద్యోగులము మేము తలుచుకుంటే నువ్వు ఎక్కడుంటావు..? 24 గంటలూ కష్టపడుతున్న మా ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీస్తే ఊరుకునేది లేదు’ అంటూ రేవంత్ పై ఫైర్ అయ్యారు. నీ మాటలు ఇలాగే ఉంటే నీ ఇంటికి కరెంట్ నిలిపివేసి చెమటలు పట్టిస్తాము అని సమాధానం ఇచ్చారు.

Share.

Comments are closed.

%d bloggers like this: