కానిస్టేబుల్ నుండి ఘరానా దొంగ గా..! 14 కేసులలో దోషిగా..!

Google+ Pinterest LinkedIn Tumblr +

అతనో పోలీస్ కానిస్టేబుల్ అతని భార్య సర్పంచ్. ఉద్యోగం బోరు కొట్టింది, రాజీనామా చేశాడు. ఇప్పుడు అతనో క్రిమినల్, ఘరానా దొంగ..! పోలీసులనే ముప్పు తిప్పలు పెట్టించాడు. వరుస చోరీలు దోపిడీలకి పాల్పడ్డాడు చివరికి చట్టం చేతికి దొరికిపోయాడు 14 కేసులతో దోషిగా కటకటాల మద్య గడుపుతున్నాడు. అతనే రత్లావత్‌ అమర్‌సింగ్‌. తెలంగాణ రాష్ట్రం నాగర్‌కర్నూలు జిల్లా వెల్దండకు చెందిన వాడు.

వివరాల్లోకి వెళితే.. రత్లావత్‌ అమర్‌సింగ్‌ 1990లో ఏపీఎస్పీ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. హైదరబాద్ యూసుఫ్ గూడాలో బెటాలియన్ లో పదేళ్ళ పాటు విధులు నిర్వహించాడు. ఆపై తన భార్య స్వగ్రామంలో సర్పంచ్ గా ఎంపికయ్యింది. భార్య సర్పంచ్ గా ఎన్నిక అవ్వడంతో విదులకి రాజీనామా చేసి తన స్వగ్రామానికి తిరిగి వెళ్లిపోయాడు. ఇక అక్కడ పొలం పనులు చూసుకుంటూ జీవనం సాగించేవాడు..

సాఫీగా జీవిస్తున్న రత్లావత్ కి మద్యం వ్యసనంగా మారింది సంపాదిస్తున్న డబ్బు సరిపోకపోవడంతో చోరీలకి అలవాటు పడ్డాడు.. అలా చిన్న చిన్న దొంగతనాల నుండి పెద్ద దొంగలా మారాడు. ఇప్పటికే అతనిపై 14 దొంగతనం కేసులు ఉన్నాయి. ఈ క్రమంలో పోలీసులకు దొరికి పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చినా తీరు మార్చుకోలేదు. 8 నెలల క్రితం ఎల్‌బీనగర్ ప్రాంతంలో వరుస చోరీలకు పాల్పడ్డాడు. అతడి కోసం నిఘా పెంచిన పోలీసులు జనవరి 29న అరెస్ట్ చేసి చర్లపల్లి జైలుకు తరలించారు. మార్చి 5న అతడిపై పీడీ చట్టం కింద కేసు నమోదైంది. దీంతో కోర్టు అతనికి 3 సంవత్సరాల కటిన కారాగార శిక్ష విదించింది.

Share.

Comments are closed.

%d bloggers like this: