మోడీజీ..మీవళ్లే కేరళలో వరదలు వచ్చాయి- రాహుల్ ట్వీటు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

తాజాగా ప్రధాని నరేంద్ర మోడి కేరళ రాష్ట్రంలోని గురువాయూర్ పర్యటించిన విషయం తెలిసిందే. ఆయన పర్యటించిన కొన్ని రోజులకే కేరళలో వరదలు సంభవించాయి. ఇక ఈ విషయాన్ని ప్రస్తావనలోకి తెచ్చిన కాంగ్రెస్ వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ తన ట్వీట్టర్ ఖాతా ద్వారా వ్యంగ్యంగా స్పందించారు. ప్రధాని మోడీని పర్యటనని ప్రస్తావనలోకి తెస్తూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ఆయన రాక వల్లే కేరళలో వరదలు సంభవించాయని ఆయన వెల్లడించారు.

ఆయన ట్వీట్ చేస్తూ.. డియర్ మోడీజీ.. మీరు ఎలాంటి సమయంలో కేరళ కి చేరారో కానీ మీ రాకతో కేరళలో అత్యంత భయకర వరదలు సంభవించాయి.. ఆ వరదలు భారీ ఆస్తి నష్టానికి ప్రాణ నష్టాన్ని మిగిల్చాయి. మీరు దయచేసి ఎక్కడికైనా వెళ్ళే ముందు మంచి సమయాన్ని ఎంచుకొని వెళ్ళండి మీరు మంచి సమయంలో వెళితే మేము దానిని ప్రశంసిస్తాము. మాకు ఇలాంటి అకాల వరదలు సంభవించవు. వరద దెబ్బ వల్ల కేరళ ఇంకా కూడా కోలుకోలేని పరిస్తితిలో ఉంది. మీరు వరదలు సంభవించిన రాష్ట్రాలకి ఇచ్చిన ఫండ్స్ ని కేరళకి కూడా ఇవ్వాలి.. ఇలా ఇవ్వకపోడం అన్యాయం. అంటూ ఆయన వ్యంగ్య దొరనిలో ట్వీట్ చేశారు.

Share.

Comments are closed.

%d bloggers like this: