ప్రేమించాడు..వాడుకున్నాడు..వదిలేశాడు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రేమించమని చుట్టూ తిరిగాడు..జీవితాంతం తోడుగా ఉంటానని నమ్మబలికాడు..కానీ, శారీరకంగా వాడుకొని వదిలేశాడు. దీంతో ఆ బాధితురాలు పోలీసులను ఆశ్రయించి తనకు న్యాయం చేయాలని కోరింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో చోటుచేసుకుంది. వివరాలు పరిశీలిస్తే….

వెస్ట్ బెంగాల్ కు చెందిన ధ్రువ విశ్వాస్ 11 సంవత్సరాల క్రితం సంగారెడ్డి జిల్లా సదాశివపేటకి వచ్చి అక్కడే స్థిరపడ్డాడు. ఆయన కూతురు మిత విశ్వాస్ పట్టణంలోని స్థానిక గాంధీ చౌక్ వద్ద మిత క్లినిక్ పేరుతో ఒక క్లినిక్ నడుపుతోంది. అయితే అదే ప్రాంతంలో ఉన్న 1వ నెంబర్ వార్డ్ కు చెందిన మాజీ కౌన్సిలర్ బి.అరుణ్ కుమార్ సంవత్సరం నుండి మిత్ విశ్వాస్ వెనకాల ప్రేమ పేరుతో.వెంటపతున్నాడు. అయితే అంతకముందే అరుణ్ కుమార్ కి కులాంతర వివాహం అయింది. ఈ విషయం చెప్పకుండా దాచిపెట్టి జీవితాంతం తోడుంటానని నమ్మించి మిత విశ్వాస్ ని వివాహం చేసుకున్నాడు…4 సంవత్సరాలపాటు బాగానే సాగిన వీరి వివాహ జీవితంలో గత 6 నెలల నుంచి గొడవలు మొదలయ్యాయి.

తరచు మిత విశ్వాస్ తో అరుణ్ కుమార్ గొడవలు పడేవాడు. ఇంటికి సరిగ్గా వచ్చేవాడు కాదు. అనుమానం వచ్చిన మిత విశ్వాస్ ఆరా తీయగా ఆతనికి ముందే పెళ్లి జరిగిందని తనని మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని విషయం అర్ధమైంది. దీంతో ఆమె అరుణ్ కుమార్ కు నిలదీయగా తాను స్థానిక ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రధాన అనుచరుడినని తనను ఎవరూ ఏమీ చేయలేరని మిత విశ్వాస్ ను బెధిరించాడు. ఏం చేయాలో అర్ధం కానీ మిత పోలీసులను ఆశ్రయించింది..తనను శరీరకంగా వాడుకోవడమే కాకుండా దాదాపు 20 లక్షల రూపాయల వరకు తీసుకున్నాడని పోలీసులకు చెప్పింది. ఎలాగైనా తనకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంది. కేసు నమోదు చేసుకున్నా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: