లేడి హోస్ట్ ఇరగదీశారు..! మరో లేడి రాబోతున్నారు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

బిగ్ బాస్ చరిత్రలోనే ఎన్నడూ లేని విదంగా మొట్టమొదటి సారి మహిళా నటి హోస్ట్ చేశారు…! ఇలా జరగడం బిగ్ బాస్ చరిత్రలోనే తొలిసారి. బిగ్ బాస్ ని హోస్ట్ చేస్తున్న మన్మధుడు నాగార్జున తన పుట్టిన రోజుని వేడుకలని జరుపుకోడానికి తన కుటుంబంతో స్పెయిన్ కి వెళ్లారు. ఇక కింగ్ నాగ్ స్పెయిన్ కి వెళ్ళడంతో ఆయన బాధ్యతలనీ స్వీకరించారు శివగామి రమ్యకృష్ణ. హోస్ట్ గా రమ్య కృష్ణ ఇరగదీశారు అంటున్నారు బిగ్ బాస్ అభిమానులు. తన హోస్టింగ్ కి బిగ్ బాస్ ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. తన హోస్టింగ్ కింగ్ నాగ్ కి ఏమాత్రం తక్కువ అవ్వలేదని అద్భుతంగా హోస్ట్ చేశారని హర్షాలు వ్యక్తమవుతున్నాయి.

ఇక నిన్న జరిగిన ఎపిసోడ్ లో రమ్య కృష్ణ కంటెస్టెంట్స్ కి టాస్క్ గా కొన్ని సినిమా సీన్స్ ని ఇచ్చి వారిని జోడీలుగా చేసి వాటిలో నటించమంది. ఇక ఛాన్స్ దొరకడంతో కంటెస్టెంట్స్ వారిలోని నటనా ప్రతిభని అద్భుతంగా కనబరచారు. ముందుగా అలీ రవి లు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులోని సీన్ ని చేశారు. ఆపై బాబా భాస్కర్ శ్రీముఖి లు చంద్రముఖి లోని క్లైమాక్స్ సీన్ ని ఇరగదీశారు.. నవ్వులు పండించారు….! ఆపై వచ్చిన శివ జ్యోతి హిమజ మహేష్ లు రంగస్థలం లోని ఓ స్సిన్ ని అచ్చు దిద్దినట్టుగా దింపేశారు.. రవి పునర్ణవి లు ఖుషీ సినిమా లోని సీన్ తో రొమాన్స్ పండించారు. ఇక చివరిగా వచ్చిన వరుణ్ వీటికా లు ఎఫ్ 2 సినిమాలోని సీన్ తో బేష్ అనిపించుకున్నారు. అందరిలోకల్ల బాబా భాస్కర్ శ్రీముఖిల జోడీ తనకి ఎక్కువగా నచ్చడం తో రమ్యకృష్ణ వారిని విజేతలుగా ప్రకటించింది.

మరిన్ని స్పెషల్స్

ఇక ఇంతే కాకుండా నిన్నటి ఎపిసోడ్ లో మరిన్ని స్పెషల్స్ జరిగాయి. రమ్య కృష్ణ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి కంటెస్టెంట్స్ తో కొంత సేపు సందడి చేశారు డైలాగ్ చెప్పారు చిందులు వేశారు.. అంతేకాదు నేడు వినాయక చవితి సందర్భంగా ఎలిమినేషన్ లో ఉన్న వారికి నో ఎలిమినేషన్ అని ఉపశమనం కలిపించారు. దీంతో ఎలిమినేషన్ లో ఉన్న పునర్ణవి హిమజ లకి కొంత పాటి ఉపశమనం లభించింది. ఇక షో ముగిసిన తరువాత వచ్చే ప్రోమో లో బిగ్ బాస్ రవి అలీ లని కన్ఫెషన్ రూమ్ కి పిలిచి ఎవరో ఓ మహిళా ఒక చైర్ లో కూర్చున్నా ఫోటో ని చూపించారు. ఆ రూమ్ అంతా చీకటిగా ఉండటంతో ఆ మహిళా ఎవరు అనేది వాళ్ళు గుర్తు పట్టలేకపోయారు.. అలా చూపించడంతో అయోమయానికి గురయ్యారు.

ఆ మహిళా ఎవరో కాదు వైల్డ్ కార్డ్ ఎంట్రీ తో హౌస్ లోకి రానున్న కంటెస్టెంట్ అని వార్తలు వినిపిస్తున్నాయి. వైల్డ్ కార్డ్ ఎంట్రీ తో రానున్న మహిళ ఎవరో కాదని మనందరికీ సుపరిచితురాలైన నటి యాంకర్ శిల్పా చక్రవర్తి అనే వార్తలు గుప్పుమంటున్నాయి. గత కొన్ని రోజులుగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ లో శ్రద్ధా దాస్, హెబ్బా పటేల్, ఈషా రెబ్బాల పేర్లు గట్టిగా వినిపించాయి. కానీ శిల్పా చక్రవర్తి రాబోతున్నారని ఆమె రాక కన్ఫామ్ అయినట్టు సమాచారం. మరి ఎవరు రాబోతున్నారు అసలు ఆ వీడియో ఏంటి అని తెలుసుకోవాలి అంటే వేచి చూడాలి.

Share.

Comments are closed.

%d bloggers like this: