అక్రమసంబంధం..! అన్నయ్య ప్రాణం తీసింది..!

Google+ Pinterest LinkedIn Tumblr +

అక్రమ సంబంధాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి..! వివాహేతర సంబంధాలకి హద్దు అదుపు లేకుండా పోతుంది. వీరు తమ ప్రియుడు/ ప్రేయసి పై మోజుతో సొంత వాల్లనే దూరం చేసుకుంటున్నారు. సంబంధాలు తెంచుకుంటున్నారు.. కొన్ని కొన్ని సందర్భాల్లో మానసిక స్థితి క్రమం తప్పి ప్రాణాలకి సైతం తెగిస్తున్నారు లేక ప్రాణాలు తీసెస్తున్నారు..! ఇక ఈ క్రమంలో అర్జున్ అనే వ్యక్తి తన ప్రేయసి తనకి ఎక్కడ దూరం అవుతుందో అనే భయంలో ఇద్దరు వ్యక్తులపై దాడి చేశాడు. ఈదరిలో ఓ వ్యక్తి ప్రాణం కోల్పోయాడు, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.

వివరాల్లోకి వెళితే.. కరకగూడెం మండలం కౌలూరుకి చెందిన పర్శిక అర్జున్ అనే వ్యక్తికి గతంలో వివాహం జరిగి తన వైవాహిక జీవనం సరిగా ఉండకపోవడంతో తన భార్యకి దూరంగా ఉంటూ ఒంటరి జీవితం కొనసాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో అర్జున్ కి పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ మహిళకి కూడా భర్త లేకపోవడంతో ఇద్దరు కలిసి సహ జీవనం కొనసాగిస్తున్నారు. ఈ క్రమం లో అర్జున్ తరచూ ఆ మహిళా ఇంటికి వస్తూ వెళ్ళేవాడు.

ఇక ఆ మహిళ ఒంటరిగా ఉండటంతో ఆ మహిళ సోదరుడు మలకం లక్ష్మణ్ అప్పుడప్పుడూ ఈ మహిళ ఇంటికి వస్తూ వెళ్ళే వాడు. లక్ష్మణ్ కి కొంత అనుమానం ఏర్పడడంతో ఆరా తీశాడు. చెల్లిని ఒంటరిగా ఉండొద్దని తనతో పాటు వచ్చేయమని లక్ష్మణ్ కోరడం అర్జున్ కి తెలిసింది. ఆ మహిళ అర్జున్ కి ఈ విషయం చెప్పగా ఆ మహిళా తనకి ఎక్కడ దూరం అవుతుందో అని కంగారూ పది లక్ష్మణ్ అతని మిత్రుడు ఆ మహిళ ఇంటి నుండి వెలుతున్న సమయంలో వారిని అడ్డగించి వారిపై దాడికి దిగాడు. ఇద్దరిపై కత్తి తో దాడి చేయగా లక్ష్మణ్ అక్కడికక్కడే మృతి చెందాడు అతని మిత్రుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. లక్ష్మణ్ భార్య పోలీసులకి ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకొచ్చింది.

Share.

Comments are closed.

%d bloggers like this: