రికార్డుల మోత మొగిస్తున్నారు..! చరిత్ర సృష్టిస్తున్నారు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రస్తుతం టీమ్ ఇండియా తన చరిత్ర లోనే ఎన్నడూ లేని విదంగా విరాట్ కోహ్లీ సారధ్యంలో ముందుకు దూసుకెళుతుంది. ఓ పక్క టెస్ట్ ఛాంపియన్ షిప్ ప్రారంభం అవ్వడంతో బౌలర్లు బ్యాట్స్ మెన్ లు చురుగ్గా తమ ప్రదర్శనలు ఇవ్వడం మొదలు పెట్టారు. వెస్ట్ ఇండీస్ తో జరుగుతున్న సిరీస్ లో భాగంగా జరిగిన మొదటి టెస్ట్ లో విజయాన్ని సాధించి మంచి ఫామ్ తో ముందుకు సాగుతున్నారు. బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా హ్యాట్రిక్ తో టెస్ట్ క్రికెట్ చరిత్ర లోనే తనకంటూ ఓ స్థానాన్ని స్థిరపరుచుకున్నాడు. ఇక ఆల్ రౌండర్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం గుంటూర్ జిల్లాకి చెందిన హనుమ విహారి వరుస సెంచరీ హాఫ్ సెంచరీ లతో తమ ప్రతిభని కనబరుస్తున్నారు. ఇక కెప్టెన్ వైస్ కెప్టెన్ ల విషయానికొస్తే.. కోహ్లీ రహానెలు కూడా చెరొక సెంచరీ హాఫ్ సెంచరీ లతో సంచలనాన్ని సృష్టిస్తున్నారు.

రెండవ టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో బుమ్రా ఒక హ్యాట్రిక్ ఆరు వికెట్లు తన ఖాతాలో వేసుకొని చరిత్ర సృష్టించాడు. క్రికెట్ చరిత్ర లోనే ఇప్పటి వరకు ఇలా జరగడం కేవలం 6 వ సారి మాత్రమే. ఇక భారత్ విషయానికొస్తే టీమ్ ఇండియా ఆల్ టైమ్ మాస్టర్ బౌలర్ ల జాబితాలో 4 వ స్థానం దక్కించుకోడం గమనార్హం. ఓపెనర్ గా ఉన్న మురళీ విజయ్ ని సైతం పక్కన పెట్టి మాయాంక్ అగర్వాల్ ని ఎంచుకున్నందుకు మాయాంక్ కూడా తన వంతు స్కోర్ ని టీమ్ కి అందించడం కెప్టెన్ వైస్ కెప్టెన్ లు ఇద్దరూ మంచి ఫామ్ లో ఉండటం టీమ్ కి ప్లస్ పాయింట్స్. ఈ విషయం ఇలా ఉండగా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ టెస్టుల్లో 50 ఔట్లు చేసి వికెట్ కీపర్ దిగ్గజం ధోని రికార్డుని బద్దలు కొట్టాడు అది కూడా అతి చిన్న వయసు లో. హనుమ విహారి తన ప్రదర్శనతో క్రికెట్ దిగ్గజాల హర్షాలు ప్రశంసలు పొందుతున్నాడు. మొత్తానికి ఐసీలసీ నిర్వహిస్తున్న టెస్ట్ ఛాంపియన్షిప్ లో ఇండియా మంచి ప్రదర్శనతోనే కాకుండా రికార్డులు కూడా బద్దలు కొడుతూ చురుగ్గా ముందుకు సాగుతున్నారు. ఇక వెస్ట్ ఇండీస్ తో జరుగుతున్నా రెండవ టెస్ట్ మ్యాచ్ లో ఇండియా 422 పరుగుల ఆదిక్యం తో ముందుకు సాగుతుంది ఈ విజయం కూడా పక్కాగా చేసుకొని ప్రదర్శిస్తోంది. విండీస్ తో సిరీస్ ముగించిన అనంతరం కోహ్లీ సేన దక్షిణ ఆఫ్రికా తో మూడు t20 లు మూడు టెస్ట్ మ్యాచ్ లు ఆడనుంది. మూడు t20 లు మూడు టెస్ట్ మ్యాచులు కూడా స్వగ్రామం లోనే జరగనున్నాయి.

Share.

Comments are closed.

%d bloggers like this: