డబ్బుంటేనే అంబులెన్స్ ఆ..? కేటీఆర్ మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం..!

Google+ Pinterest LinkedIn Tumblr +

డబ్బులు లేక సొంత కూతురు మృతు దేహాన్ని చేతులపై మోసుకెళ్లిన తండ్రిని చూసి సమాజం విలవిలబోయింది. కన్నీటి పర్యంతం అయ్యింది. ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యపు దొరని ఓ వైపు ఎంతో అనురాగంతో కన్న కూతురుని ఏ చేతుల మీద ఎత్తుకొని ఆడించారో అవే చేతులపై బిడ్డ మృతు దేహాన్ని ఎత్తుకెళ్లడంతో ఆ తండ్రి క్రుంగిపోయాడు. ఈ ఘటన సాక్షాత్తు తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లాలో వెలుగు చూసింది.

వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ లోని పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్ మండలం కూనారం గ్రామానికి చెందిన సంపత్ ఏడేళ్ల కుమార్తె కోమలత గత కొన్నాళ్లుగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. సంపత్ దేగ్గర తగినంత డబ్బు లేక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చాడు. ప్రభుత్వం ఆదుకుంటోంది అనే ఆషతో ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిస్తే మెరుగైన వైద్యం అందించి ఎలాగో కాపాడలేకపోయారు. కనీసం బిడ్డ చనిపోతే ఆ మృతు దేహాన్ని తరలించడానికి కూడా సహాయపడలేకపోయారు. పైగా మాటలతో తూట్లు పొడిచారు. ఇది అధికారుల నిర్లక్ష్యమో లేక ప్రభుత్వం వైఫల్యమో అర్థం కానీ పరిస్థితి..!

బిడ్డ చనిపోయింది జోబులో చిల్లి గవ్వ లేదు.. ఆ తండ్రి పరిస్థితిని అర్థం చేసుకోకుండా అంబులెన్స్ లేదు..! డబ్బుంటేనే అంబులెన్స్ అని అమానుషంగా స్పందించారు. రోదిస్తున్న తండ్రిని చూసి జాలి పడలేదు. నీచమైన మాటలతో బాధపెట్టారు. ఈ సంఘటన తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ సొంత నియోజకవర్గం లో చోటు చేసుకోడం అత్యంత బాధాకరం. మంత్రి స్వగ్రామం లోనే ఇలా జరిగితే ఇక రాష్ట్రం పరిస్తితి ఎంటో మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం..!

Share.

Comments are closed.

%d bloggers like this: