ఆత్మహుతి దాడి మేమే చేశాం..!- తాలిబాన్ ఉగ్రవాద సంస్థ

Google+ Pinterest LinkedIn Tumblr +

ఉగ్రవాదం రోజురోజుకి పెరిగిపోతుంది. ఉగ్రవాద చర్యలకి నేల కొలువయ్యింది. ఉగ్రవాదానికి ప్రభుత్వాలు చరమగీతం పాడేలా కటినమైన చర్యలు తీసుకోకతప్పదు. ఆత్మహుతి దాడులు ఉగ్రవాదులకి ట్రెండ్ లా మారాయి. తమను తాము బలి ఇచ్చుకుంటూనే ఎంతో మందిని బలి చేస్తున్నారు కొన్నిసార్లు పదుల సంఖ్యలో ప్రాణనష్టం జరుగుతుంటే మరి కొన్ని సార్లు వందల సంఖ్యలో ప్రాణనష్టం వాటిల్లుతుంది. ఈ తరుణంలో తాజాగా ఆఫ్ఘనిస్తాన్ సెంట్రల్ అయిన కాబూల్ నగరంలో జరిగిన ఆత్మహుతి దాడి ఒక్కసాయిగా భయాందోళనకి గురి చేసింది.

ఉగ్రవాదులక తమకి ప్రభుత్వం పైనో ఇంకా ఏ ఇతర కారణాల పైనో ఉన్న కక్షని ఏమి ఎరుగని సాదారణ ప్రజల పై తీర్చుకుంటున్నారు. కాబుల్ నగరం లో అంతర్జాతీయ సంస్థలు నెలకొని ఉన్న నివాస ప్రాంతంలో ఆత్మహుతి దాడి జరిగింది. కారులో వచ్చిన తీవ్రవాదులు ఆత్మ హుతి దాడికి పాల్పడడంతో తమతోపాటు మరో ఐదుగురు ప్రాణాలను పొట్టన పెట్టుకున్నారు.. 50 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. దాడి జరిగిన చోటకి హుటాహుటిన వచ్చిన అధికారులు గాయపడిన వారిని క్షతగాత్రులని వెంటనే ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇప్పటికీ కొంతమంది పరిస్థితి విషమంగానే ఉందని ఆ దేశపు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి నస్రత్ రహిమి తెలిపారు. ఈ దాడికి తామే బాద్యులమని తాలిబన్ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. దాడికి పాల్పడిన వారి పై త్వరలో కటిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం వెల్లడించింది.

Share.

Comments are closed.

%d bloggers like this: