ఎంతకైనా తెగిస్తాం-పాక్..! ప్రాణాలైనా ఇస్తాం-భారత్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

మోదీ సర్కార్ జమ్ము కాశ్మీర్ పై ఆర్టికల్ 370 ని రద్దు చేసినప్పటినుండి పాక్ కోపంతో రగిలిపోతుంది. కసితో ఊగిపోతుంది..! భారత్ పాక్ ల మధ్య యుద్ధాన్ని తలపెట్టే విదంగా ఉసి కొలుపుతుంది మాటలతో దాడి చేస్తుంది. పాక్ నేతలు క్రికెటర్లు సెలబ్రిటీలు సైతం యుద్ధానికి సై అంటున్న పరిస్థితి నెలకొంది. నిన్న పాక్ మాజీ క్రికెటర్ మాటలే ఇందుకు నిదర్శనం.. భారత్ బాంబులతో దాడి చేస్తే తాము కత్తులతో దాడి చేస్తారట.. ఇది పాక్ పరిస్థితి..! కానీ ఆ దేశ ప్రధాని మాత్రం యుద్ధం వొద్దు బాస్ యుద్ధం వల్ల కలిగే నష్టం చెప్పలేనిది అని అంటున్నారు.

కాశ్మీర్ కోసం ఎంతకైనా తెగిస్తాము అంటూనే యుద్ధాన్ని వొద్దు అంటున్నారు.. ఇదెక్కడ విడ్డూరమో..? కాశ్మీర్ ఇప్పుడు భారత్ లోని అతర్భాగమే అన్న విషయాన్ని ఆయన మరిచిపోయారు కాబోలు. యుద్ధం ప్రభావం చాలా భయంకరంగా ఉంటుంది. రెండు అణ్వస్త్ర దేశాలే అంటూ హితం పలుకుతున్నారు. ఇక ఈ విషయం ఇలా ఉంటే మన దేశ రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఇటీవలే చేసిన ట్వీటు దుమారం రేపుతోంది.

ఆయన ట్వీట్ చేస్తూ.. ఇప్పటి వరకూ అణ్వస్త్రాలను ముందు వాడొద్దనే విధానానికి కట్టుబడే ఉన్నాం. కానీ ఇక మీదట ఇదే విధానానికి కట్టుబడి ఉండటం అన్నది ‘పరిస్థితుల’ మీద ఆధారపడి ఉంటుందని రాజ్‌నాథ్ ట్వీట్ చేశారు. ఇక దీనికి స్పందించిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. తమ దేశం అణ్వాయుధాలను ముందుగా వాడబోదట. భారత్, పాక్ రెండూ అణ్వస్త్ర దేశాలే, ఇరు దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచానికి ముప్పుగా పరిణమిస్తున్నాయని ఇమ్రాన్ ఆందోళన వ్యక్తం చేశారు. భారత్‌తో ఎట్టి పరిస్థితుల్లో తామే యుద్ధాన్ని ప్రారంభించ బోమని చెప్పారు. లాహోర్‌లో సిక్కులను ఉద్దేశించి మాట్లాడుతూ పాక్ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే ఆయన దక్షిణాసియాపై అణు నీడ కమ్ముకుందని వ్యాఖ్యానించడం గమనార్హం. మరో పక్క మోడీ సర్కార్ మంచి దూకుడు మీద ఉన్న విషయం తెలిసిందే.. దేనికైనా సిద్ధం అని పాక్ అంటుంది..! పీ‌ఓకే కాశ్మీర్ ల కోసం ప్రాణం ఐనా ఇస్తాం అంటున్నారు అమిత్ షా..! ఇక చూడాలి మరి ఏం జరుగుతుందో ఈ వ్యవహారం ఎలా సద్దుమనుగుతుందో..?

Share.

Comments are closed.

%d bloggers like this: