ఆ బీజేపీ అధ్యక్షుడి కుమారుడు.. మిస్సింగ్ టూ మృతి..?

Google+ Pinterest LinkedIn Tumblr +

ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఉదయ్ ప్రతాప్ కుమార్ కొడుకు శ్రీహర్ష గత 12 రోజులుగా కనపడట్లేదు. అతని ఆచూకీ కనిపించకపోయేసరికి పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.. కాగా హర్ష మృతి దేహాన్ని నేడు పోలీసులు కనుగొన్నారు. మిస్సింగ్ కేస్ కాస్త మృతిగా మారేసరికి తల్లిదండ్రులు శోకసముద్రంలో విలపిస్తున్నారు. లండన్ కి చదువుల నిమిత్తం వెళ్ళిన కొడుకు చదువు పూర్తి చేసుకొని తిరిగొస్తాడు అనుకుంటే తన జీవితాన్నే పూర్తి చేసుకున్న శ్రీహర్ష మృతిని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు.

లండన్ కి పీజీ చదవడం నిమిత్తం వెళ్ళిన శ్రీహర్ష గత 12 రోజులుగా కనిపించకపోడం దుమారాన్ని లేపింది. లండన్ లో స్నేహితులతో బీచ్ కి వెళ్ళిన శ్రీహర్ష ఆచూకీ ఉన్నట్టుండి కనిపించకపోయేసరికి అతని ఫ్రెండ్స్ పోలీసులకి ఫిర్యాదు చేశారు. పోలీసులు ఫిర్యాదు అనంతరం శ్రీహర్ష ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టగా.. అతని బ్యాగ్ కనిపించింది. బ్యాగ్ లో హర్ష ఫోన్ ల్యాప్ టాప్ పుస్తకాలు కనిపించాయి. కానీ హర్ష ఆచూకీ మాత్రం కనపడకుండా పోయింది. దీంతో 12 రోజులక్రితం హర్ష తల్లిదండ్రులకి పోలీసులు సమాచారాన్ని అందజేశారు. అప్పటినుండి తల్లిదండ్రులు కన్నీటిపర్యంతం అవుతున్నారు.

గాలింపు చర్యలు చేస్తున్న పోలీసులు హర్ష స్నేహితులని కాలేజీ యాజమాన్యాన్ని ప్రశించారు ఎవ్వరిని అడిగినా హర్ష ఆచూకీ మాత్రం బయటపడలేదు. దీంతో హర్ష తండ్రి ఉదయ్ ప్రతాప్ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తదితరుల సహాయంతో అక్కడి పోలీసు శాఖ తో అధికారులతో తెలుగు వారితో చర్చలు చేశారు. కానీ చివరికి లాభం లేకుండా పోయింది. దీంతో శోక సముద్రంలో మునిగిపోయారు తల్లి తండ్రులు. మిస్సింగ్ కేస్ గా వెలుగులోకి వచ్చిన ఈ కేసు మృతిదేహం దొరకడంతో ఇప్పుడు ఇది హత్య నా ఆత్మహత్య నా లేక ఇంకేమైనా కారణాల వల్ల మృతి చెందాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: