బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుతూ.. యువతి ఆత్మహత్య..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రేమించింది…! ఆ ప్రేమే ఆమె ఆత్మహత్య కి కారణమయ్యింది. ట్రిపుల్ ఐటీ లో చదువుతుంది.. ఎంతో కష్టపడితే గాని అలాంటి యూనివర్సిటీలో సిట్టు దొరకదు. అంత కష్టపడి చదివి చివరికి కేవలం ఒక అబ్బాయి పై తనకున్న ప్రేమ వల్ల ఆత్మహత్య చేసుకుంది. ఈ విద్యార్థిని ఓ యువకుడితో వీడియో కాల్ లో మాట్లాడుతూ ఉనివర్సిటీ పరిసరాల్లో ఉరేసుకొని ఆత్మహత్యకి పాల్పడింది. ప్రస్తుతం ఈ వార్తా ఇప్పుడు తీవ్ర సంచలనాన్ని రేపుతుంది.

వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా గోకవరం గ్రామానికి చెందిన భాగ్యలక్ష్మి కృష్ణా జిల్లా నూజివీడులోని ట్రిపుల్‌ ఐటీలో కంప్యూటర్‌ సైన్స్‌ 3వ సంవత్సరం చదువుతోంది. ఆమెకి ఓ అబ్బాయితో పరిచయం ఏర్పడింది.. ఆ పరిచయాన్ని ప్రేమ గా భావించింది భాగ్యలక్ష్మి. ఇక ఘటన జరిగే సమయానికి ఆమె తన హాస్టల్ గదిలో తన బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుతూ ఆత్మహత్యకి పాల్పడింది. సమాచారాన్ని అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని వివరాలని సేకరించారు. పోలీసుల కథనం ప్జ్రకారం భాగ్యలక్ష్మి తన బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుతూ ఆత్మహత్యకి పాల్పడినట్టు తెలుస్తుంది. ఇకపోతే హాస్టల్ సిబ్బంధి కూడా ఆమె మరణానికి ప్రేమే కారణం అని భావిస్తున్నారు. తన బాయ్ ఫ్రెండ్ ని అదుపులోకి తీసుకొని పూర్తి వివరాలని వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. ఓ ఉనివర్సిటీ హాస్టల్ లో ఇలాంటి ఘటన సంభవించడంతో ఈ ఘటన కలకలం రేపుతుంది.

Share.

Comments are closed.

%d bloggers like this: