టిక్ టాక్ పిచ్చి…ఏకంగా జీపునే తగలబెట్టేశాడు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

టిక్ టాక్..ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా ఇదే హాట్ టాపిక్. దీని పిచ్చితో కొందరు ప్రాణాలు పోగొట్టుకుంటుంటే..మరికొందరు మాత్రం ఆస్తుల్ని తగలబెట్టుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే గుజరాత్‌లో చోటుచేసుకుంది. తన వీడియోస్‌కు ఎక్కువ వ్యూస్, లైకులు రావాలనుకున్నాడో ఏమో గాని ఏకంగా పెట్రోల్ పోసి బంగారం లాంటి తన జీపును తగలబెట్టేశాడు ఇంద్రజీత్ అనే అతను…అసలు విషయానికొస్తే….ఎప్పుడూ రద్దీగా ఉండే గుజరాత్‌ రాజ్‌కోట్‌లోని కొథారియా రోడ్డులో బిజీ బిజీగా జనం, అటు ఇటూ తిరుగుతున్నారు. వాహనాలు కూడా బాగానే రాకపోకలు కొనసాగిస్తున్నాయి. ఫైరింజన్ ఆఫీస్ కూడా ఆ రోడ్డులో ఉంది.

ఇంద్రజీత్ ఆ ఆఫీస్ ఎదుట తన జీపును నిలబెట్టాడు. ఇంతలో అందరూ చూస్తుండగానే.. పెట్రోల్ పోసి బంగారం లాంటి తన జీపును తగలబెట్టేశాడు. దింతో జనమంతా ఇదేం పిచ్చి రా బాబు అనుకుంటూ…ఆ తతంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియా లో అప్లోడ్ చేసారు. నిమిషాల్లో వైరల్ గా మారిన ఆ వీడియో చివరికి పోలీసుల వరకు చేరింది. దీంతో ఈ ఘటనకు పాల్పడిన ఇంద్రజీత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. జీపును ఎందుకు తగలబెట్టావంటూ ఆరా తీశారు. అతడు చెప్పిన కారణం విని పోలీసులు సైతం షాక్ అయ్యారు. టిక్ టాక్ వీడియో కోసమే ఇదంతా చేశానన్నాడు ఇంద్రజీత్. అంతేకాదు ఈ తతంగాన్ని మొత్తం వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసిన అతడి స్నేహితుడ్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రద్దీగా ఉన్న ప్రాంతంలో ఈ పిచ్చి చేష్టలేంటంటు..నాలుగు తగిలించారు.

Share.

Comments are closed.

%d bloggers like this: