మండపంలో మంటలు.. దగ్దమైన కార్లు వాహనాలు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

హైదరబాద్ మల్కాజిగిరి విష్ణుపురి కాలనీలోని మైత్రీ నివాస్ అపార్ట్‌మెంట్‌లో ఏర్పాటు చేసిన గణేశ్ మండపంలో అపశృతి చోటు చేసుకుంది. అక్కడ జరిగిన అగ్ని ప్రమాదం అటు పక్కనే ఉన్న కార్ల పైకి వాహనాలపైకి వ్యాపించడంతో భారీ ఆస్తి నష్టం వాటిల్లింది. అప్రమత్తమైన అపార్ట్‌మెంట్‌ వాసులు వెంటనే మంటలని గమనించడంతో పార్క్ చేసిన వాహనాలని బయటకి తరలించారు. అక్కడ నుండి బయట పడ్డారు దీంతో ప్రాణ నష్టం తప్పింది.

వివరాల్లోకి వెళితే.. మైత్రి నివాస్ అపార్ట్‌మెంట్‌లో ఏర్పాటు చేసిన గణేశ్ మండపంలో మంటలు సంభవించాయి. మండపంలో ఏర్పాటు చేసిన అఖండ జ్యోతి కిందపడటంతో మంటలు అంటుకున్నాయి. ఆ మంటలు డెకరేషన్ క్లాత్ కి అంటుకోడంతో మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. మంటలు నలు వైపులా వ్యాపించడంతో పక్కనే పార్క్ చేసిన కారు వాహనాలు తగలబడ్డాయి. పూర్తిగా దగ్దమయ్యాయి. మంటలు గమనించిన వాచ్ మెన్ వెంటనే అప్రమత్తమై అపార్ట్‌మెంట్‌ వాసులకి తెలియజేయడంతో స్థానికులు పార్క్ చేసిన వాహనాలని బయటకి తరలించి ఫైర్ ఇంజన్ కి ఫిర్యాదు చేశారు. హుటాహుటిన ఫైర్ ఇంజన్ ఘటనా స్థలానికి చేరుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది.

Share.

Comments are closed.

%d bloggers like this: