బీజేపీ లోకి జనసేన…సీఎంగా పవన్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

బీజేపీ లో జనసేన విలీనం..గత కొన్నాళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను హీటేక్కిస్తున్న హాట్ టాపిక్. గత ఎన్నికల్లో జనసేన ఓటమి తర్వాత.. బీజేపీతో స్నేహంగా మెలగాలని పవన్ కళ్యాణ్ భావించారనే ప్రచారం జోరుగా సాగింది. తానా సభల కోసం అమెరికా వెళ్లిన సందర్భంగా ఆయన రామ్ మాధవ్‌తో భేటీ కావడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఇటీవల అమరావతి ప్రాంత రైతుల సమస్య గురించి మాట్లాడిన పవన్ కళ్యాణ్.. ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు గుప్పించారు. దీంతో జనసేన పార్టీ బీజేపీ వైపు చూస్తోందనే భావన జనాల్లో బలపడింది. కాగా, ఇప్పుడు తాజాగా ఏపీ బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీశ్ చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. గుంటురులో ఆయన మాట్లాడుతూ.. డిసెంబర్ లోగా బీజేపీలో జనసేన కలుస్తుందని చెప్పారు. జనసేనాని పవన్ కల్యాణ్ ఢిల్లీకి వస్తారని… ఆయన కోసం ఢిల్లీ నాయకులు కూడా ఏపీకి వస్తారని తెలిపారు. పవన్ ముఖ్యమంత్రి అయితే చూడాలని ఉందని చెప్పారు. బీజేపీలో పవన్ చేరితే ఆయన బలం అమాంతం పెరుగుతుందని… ఆ తర్వాత ఆయనను ఎవరూ ఆపలేరని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన సత్తా చాటుతుందని ముఖ్యమంత్రి జగన్ జాగ్రత్త పడుతున్నారని చెప్పారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న అన్నం సతీశ్… ఈ మధ్యనే బీజేపీలో చేరారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశం అయ్యాయి.

Share.

Comments are closed.

%d bloggers like this: