వివేకా కేసు పై కన్నేసిన డీజీపీ…! సిట్ బృందాన్ని సెట్ చేశాడు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరుడు మాజీ మంత్రి బ్వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు పెను దుమారాన్నే రేపుతుంది. ఈ కేసులో నిత్యం ఓ కొత్త ట్విస్ట్ బయటపడుతుంది. ఇక ఈ హత్య కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాసులు రెడ్డి ఆత్మహత్యకి పాల్పడటంతో ఈ కేసు సంచలనంగా మారింది. నిందితుడు శ్రీనివాసులు రెడ్డి సూసైడ్ నోట్ రాసి ఆత్మ హత్య పాల్పడటంతో మరోసారి ప్రభుత్వ దృష్టిని మరుల్చుకుంది. ఈ నేపధ్యంలో ప్రస్తుత ఏపీ డీజీపీ గా ఉన్న గౌతం సారంగ్ బుదవారం నాడు సమీక్ష నిర్వహించారు.

చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఎంపిక సిట్ బృందంతో ప్రస్తుత సిట్ బృందంతో ఆయన సుధీర్గ సమావేశం నిర్వహించారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం లో నియమించిన 7 గురు సభ్యులు ప్రస్తుత ప్రభుత్వం నియమించిన 33 మంది కలిపి మొత్తం 40 మందితో కలిగిన సిట్ బృందంతో ఆయన సమావేశం అయ్యారు. కేసులో నిందితులని త్వరగా పట్టుకోవాలని ఆయన వారికి ఆదేశించారు. ఎక్కడా జాప్యం చేయకుండా ముమ్మరంగా దర్యాప్తు చేయాలని ఆయన వారికి సూచించారు.

గౌతమ్ సవాంగ్ ఈ కేసు పై తనకున్న ప్రశ్నలని సిట్ బృందం వారికి తెలియజేసి పలు అంశాలపై వారిని నిలదీశారు. నిందితుడు శ్రీనివాసులు రెడ్డి ఆత్మహత్యకి పాల్పడటాన్ని ముందుగా ఎందుకు పసిగట్టలేకపోయారు అని వారిని నిలదీశారు. ఈ కేసు లో ఉన్న అన్నీ కొనాలని ఆయంకి తెలియజేయాలని నినితుడి ఆత్మహత్య వెనుక ఉన్న కారణాలని ఆయనకి త్వరలో తెలియజేయాలని వారికి సూచించారు. పులివెందులతో పాటు చుట్టూ పక్క ఉన్న ప్రాంతాల్లో కూడా విచారణ జరపాలని అధికారులకి ఆయన సూచించారు. సమావేశం అనంతరం గౌతం సవాంగ్ పులివెందుల లోని వివేకా ఇంటిని తానే స్వయంగా వెళ్ళి పరిశీలించారు వారి కుటుంబ సభ్యులని హత్య జరిగిన తరువాత జరిగిన పరిణామాలని తానే స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: