ఆటో కి 34 వేలు ట్రాక్టర్ కి 59 వేలు..! ఇవి చలాన్ ధరలు..! అయోమయంలో డ్రైవర్లు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

సెప్టెంబర్ 1 నుండి కొత్త ట్రాఫిక్ నిబంధనలు అమలులోకి వచ్చాయి. పత్రాలు సరిగా లేకుండా వాహనాలు నడపడం తప్పే అయినప్పటికీ ఇంత మొత్తంలో చలాన్లు పడితే జనం అప్పులపాలు అవ్వడం తప్పనిసరి. చలాన్ల రేట్లు భారీగా పెంచడంతో జనం బోరుమంటున్నారు.. కంగుతింటున్నారు..! భరత్ అనే నేను సినిమాలో లాగా చలాన్ రేట్లు దారుణంగా ఉన్నాయి, ఓ లెక్కన చెప్పాలంటే అంభారాన్ని మించుతున్నాయి. జనాలు తమ వాహనాలని బయటకి తీయడానికే వనికిపోతున్నారు. ఏ ఒక్క పత్రం లేకపోయిన ఇక అంతే సంగతులు జరిమానా వేల సంఖ్య లోనే ఉంటుంది. నిబంధనలు అమలు లోకి వచ్చిన తరువాత విదించిన జరిమానాలు చూస్తే మతి పోతుంది. కళ్ళు గిర్రుమని తిరుగుతున్నాయి.

పాపం ఓ వ్యక్తి రూ.13 వేలు పెట్టి సెకండ్ హ్యాండ్ లో బండి కొనుకున్నాడు.. తన వద్ద సరైన పత్రాలు లేకపోవడంతో తనకి ఏకంగా 23 వేలు రూపాయల చలానా పడింది. తన నెల సంపాదన కూడా అంతలేదని ఆ వ్యక్తి వాపోయాడు. ఇది ఇలా ఉంటే గుర్గావ్ కి చెందిన ఓ వ్యక్తి ట్రాక్టర్ నడుపుకుంటూ ఉంటాడు. ఈ ట్రాక్టర్ డ్రైవర్ కి దారుణంగా 59 వేల జరిమానా పడింది. తన వద్ద లైసెన్స్, ఆర్ సీ పత్రాలు, పాత చలాన్లు, సిగ్నల్ ఉల్లంఘన పొలుషన్ చెక్ పేపర్లు లేనందున ఇతనికి చలాన్ ఇంతగా పడిందని అధికారులు అంటున్నారు.

చలాన్లు ఇంత దారుణంగా ఉంటే పొట్ట కూటి కోసం రోజుకి పదిగంటలు ట్రాక్టర్, ఆటో, రిక్షా లు నడుపుకునే ఇటు వంటి డ్రైవర్ల పరిస్తితి ఏంటో ఎలా ఉండబోతుందో అని అసలు ప్రభుత్వం కానీ న్యాయస్థానం కానీ గమనిస్తుందా అనిపిస్తుంది. చలాన్లు మాత్రం భారీగా పెంచారు మరి రోడ్ల పరిస్థితి ఎలా ఉందో చూస్తున్నారా..? ఎటు చూసిన గుంతలు అని ప్రజలు ప్రభుత్వం పై మంది పడుతున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: