ఆచార్య దేవో భవ..! ఉపాద్యాయ దినోత్సవ శుభాకాంక్షలు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

నేడే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి. ఆయన గుర్తుగా నేడు జాతి ఉపాద్యాయుల దినోత్సవాన్ని జరుపుకుంటుంది. నేడు ఉపాద్యాయులని గౌరవించుకునే దినం ప్రతీ ఒక్కరూ తమ గురువులని పురస్కరించుకునే రోజు. రాధాకృష్ణన్ 1888 లో తిరుత్తణి లో జన్మించారు. రాధాకృష్ణన్ ఒక గొప్ప గురువు పండితుడు. ఈయన 16 సార్లు నోబుల్ సాహిత్య బహుమతికి 11 సార్లు నోబుల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు. భారతరత్న పురస్కారం కూడా దక్కింది. భారత రాజ్యాంగం నిర్మాణం అయిన తరువాత అయిన మొట్టమొదటి ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్.

రాధాకృష్ణన్ 1943 నుండి 1952 వరకు ఢిల్లీ ఉనివర్సిటీ లో వైస్ ఛాన్సులర్ గా విడులు నిర్వహించారు. ఆపై రాధాకృష్ణన్ 1952 నుండి 1962 వరకు ఉపరాష్ట్రపతిగా ఆపై 1962 నుండి 1967 వరకు రెండవ రాష్ట్రపతి గా విడులు నిర్వహించారు. మహాత్మా గాంధీ ఎప్పుడూ అనేవారు.. తనకి రాధాకృష్ణన్ ఒక గొప్ప గురువని తనకి ఆయన ఎంతగానో స్పూర్తి అని బాపు అనేవారు.. అలాంటి గొప్ప పండితుడు రాధాకృష్ణన్. రాధాకృష్ణన్ మొదటిసారిగా రాష్ట్రపతి అయ్యినప్పటినుండి అంటే 1962 నుండి భారతహ దేశం ఆయన పుట్టిన రోజుని ఉపాద్యాయుల దినోత్సవంగా జరపాలని నిశ్చయించుకుంది.

గురువు లోని ‘గు’ అంటే చీకటని ‘రు’ అంటే దాన్ని పోగొట్టేవాడని సమాజం లో చీకటి పోగొట్టే వాడే గురువు అని పెద్దలు అన్నారు. అలాంటి గురువులని పూజించాలని మనకి సమాజమే కాదు పురాణాలు వేదాలు కూడా చెబుతున్నాయి. పురాణాల్లోకి వెళితే అర్జునుడు ఎల్లప్పుడూ కృష్ణుడిని గురువులా పూజించే వాడు.. అర్జునుడికి భగవత్ గీత చెప్పి తనలోని చీకటిని కృష్ణుడు తొలగించాడు. ఇక పోతే రామకృష్ణ పరమహంస వివేకానందుడి గురువు ఈయన చాలా నిరాడంభరుడు.. కేవలం ఒక్కసారి వివేకానందుడిని ఆయన తాకడంతో వివేకానందుడి జీవితమే మారిపోయింది.. ఇలా మనకి పురాణాలు నేర్పిస్తాయి. వేదాల వేషయానికొస్తే మాతృ దేవో భవ పితృ దేవో భవ అతిథి దేవో భవ అన్న తరువాత ఆచార్య దేవో భవ అన్నారు అంటే గురువులని పూజించమని అర్థం. ఇలా మనకి వేదాలు పురాణాలు ఇతిహాసాలు అన్నీ కూడా గురువులని పూజించమని గురువుల పట్ల విదేయత చూపమని చెబుతున్నాయి. ఈ సందర్భంగా ప్రతీ ఒక్కరూ తమ గురువులని పూజించాలని వారిని నేడు పురస్కరించాలని మహా న్యూస్ కోరుతుంది.

Share.

Comments are closed.

%d bloggers like this: