తెలంగాణ అభివృద్ధికి కేంద్రం అడ్డుగా మారింది..? ఎందుకు అడ్డుపడుతుంది..?

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలంగాణ రాష్ట్రం లోని కంటోన్మెంట్ లో ఎప్పుడూ ట్రాఫిక్ ఇబ్బందులే ఉంటాయి. అక్కడి ప్రజలు నిత్యం ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బంధులు పడుతుంటారు. వారి ఇబ్బంధులని పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని అడుగులు వేస్తున్న వాటిని కేంద్రం తిప్పి కొడుతుందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానిస్తున్నాడు. కంటోన్మెంట్ లో ప్రజలు ఎన్నిసార్లు గులాబీ జండానే ఎగిరెస్తున్నా అధికారులు మాత్రం వారికి తగిన సహాయం చేయట్లేదాని వారికి తగిన న్యాయం జరగట్లేదు అని అక్కడి ప్రజలు విమర్శిస్తున్నారు. కానీ కేటీఆర్ మాత్రం అక్కడ సాయన్న అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నో అభివృద్ధి పనులు చేశాడని ప్రజలు అందుకే ఆయనని ఆశీర్వదిస్తున్నారు అని వ్యక్తం చేశారు. మరోసారి కూడా అక్కడ ప్రజలు టీఆర్ఎస్ పార్టీని ఎంచుకోడానికి చూస్తున్నారు. అసలు నిజానికి తెలంగాణ ప్రభుత్వం సహాయం చేయట్లేదా..? లేక కేంద్రం అడ్డుపడుతుందా..?

తెలంగాణ ప్రభుత్వం నిజంగానే అక్కడ ట్రాఫిక్ సమస్యని తీర్చడానికి స్కైవే ల ఏర్పాటు చేయాలని ప్లాన్ చేసింది దీనికి గాను వారికి కేంద్ర ప్రభుత్వం నుండి మద్దత్తు అవసరం. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇందుకు సహకరించట్లేదు. తెలంగాణ మంత్రులు పార్లమెంట్ ఐలో ఈ విషయాన్ని ఎన్ని సార్లు లేవదీసినా కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ మాటనే పట్టించుకోవడం లేదు అందుకే ఈ స్కైవే లు ఏర్పాటు జరగడం లేదు. ఇక పోతే కంటోన్మెంట్‌లోని డిఫెన్స్ హాస్పిటల్‌ను వంద పడకల దవాఖానగా విస్తరించి, పేదలకు మరిన్ని వైద్యసేవలు అందించేందుకు చేస్తున్న ప్రయత్నాలు సైతం ముందుకు పోవడంలేదు. డిఫెన్స్ హాస్పిటల్‌ను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించాల్సిందిగా కేంద్రానికి మరోసారి ఉత్తరం రాస్తామని కేటీఆర్ అంటున్నారు. మరి ఈ విషయాలని కేంద్రం ఎందుకు పట్టించుకోడం లేదు…? కేంద్రం తెలంగాణ రాష్ట్రం పై కక్ష సాదిస్తుందా..? తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడుతుందా అనే ప్రశ్నలు అటు ప్రజల్లో ఇటు రాజకీయ వర్గాల్లో కలుగుతున్నాయి.

Share.

Comments are closed.

%d bloggers like this: