బాలరాజు.. పవన్ కి హ్యాండ్ ఇస్తారా..? జగన్ కి షాక్ ఇస్తారా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

జనసేన పార్టీ నేత మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు జనసేన పార్టీని వీడి వైసీపీలో చేరుతున్నారని వార్తలు వస్తున్నాయి. అనారోగ్యం కారణంగా ఆయన గత మూడు నెలలుగా పార్టీకి.. పార్టీ కార్యాలయానికి దూరంగా ఉంటున్నారు. రాజకీయాల్లో కూడా చురుగ్గా పాల్గొనట్లేదు. బుదవారం నాడు ఆయన పార్టీ కార్యాలయానికి తిరిగి హాజరయ్యారు. పార్టీ కార్యకర్తలతో పార్టీ సభ్యులతో ఆయన నిన్న కొంతసేపు చర్చలు చేశారు. సమావేశంలో ఆయన ముఖ్యమంత్రి జగన్ ని పొగిడినట్టుగా ఆయన చేపడుతున్న పనులు పథకాల గురించి ప్రస్థావించారు. త్వరలో ఆయన పార్టీ మారే యోజనలో ఉన్నారని తన కార్యకర్తలతో చెప్పినట్టుగా సమాచారం.

సమావేశం అనంతరం ఆయన మీడియా తో సమావేశం ఏర్పాటు చేశారు.. మీడియా సమావేశం లో ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ఉపయోగపడే పథకాలను జగన్ అమల్లోకి తీసుకొచ్చారని సీఎంను పొగిడారు. మధ్యనిషేధం విధింపు మంచి నిర్ణయమని సీఎంను పొగడ్తలతో ముంచెత్తారు. ప్రభుత్వ పథకాలు పేదప్రజలకు అందినప్పుడే ప్రభుత్వానికి మంచిపేరు వస్తోందని ఆయన చెప్పారు. వలంటీర్ల ఎంపికలో ఉద్యోగాలు ఇప్పిస్తామని మండల స్థాయి అధికారులు అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.

దీంతో జనసేన పార్టీ అధినేత పవన్ కి బాలరాజు షాక్ ఇవ్వనున్నారని ఆయన త్వరలో వైసీపీ లో చేరతారని వార్తలు వినిపిస్తున్నాయి. బాలరాజు ఈ విషయాన్ని వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తో కూడా చర్చించారని దానికి ఆయన ఒప్పుకోడం కూడా జరిగిందని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది. మరి ఆయన పవన్ కి హ్యాండ్ ఇస్తారో జగన్ షాక్ ఇస్తారో తెలియాలంటే వేచి చూడాలి.

Share.

Comments are closed.

%d bloggers like this: