చలాన్లు కట్టాల్సిందే..! చట్టానికి అందరూ భయపాడాల్సిందే..!-కేంద్ర మంత్రి గడ్కరీ

Google+ Pinterest LinkedIn Tumblr +

కొత్త ట్రాఫిక్ నిబంధనలు ఆంక్షలు అమలు లోకి వచ్చాయి..! ట్రాఫిక్ నియమాల ఉల్లంఘన పై విధించే చలాన్లు ఆకాశాన్ని తాకుతున్నాయి. వాహనదారులు పోలీసులని చూస్తేనే భయపడిపోతున్నారు..! అక్కడ ట్రాఫిక్ పోలీస్ ఉన్నాడంటే ఇక ఆ దారికి ససేమిరా అంటున్నారు. ఏ ఒక్క చిన్న పత్రం లేకపోయినా ట్రాఫిక్ నియమం ఉల్లంఘించినా ఇక అంతే సంగతులు చలాన్లు నెల జీతాలని ఒక్కోసారి వాహనం ఖరీదుని కూడా మించిపోతున్నాయి. వాహనదారులు లబో..దిబో మొత్తుకుంటున్నారు. ప్రభుత్వం వైఖరి పై విమర్శలు చేస్తున్నారు.. చలాన్ లని తగ్గించాలంటూ కోరుతున్నారు.

ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో చలాన్ల పేరిట కోట్లకి కోట్లు వసూళ్లు చేశారు అధికారులు. చలాన్లు కట్టలేక ప్రజలు జైళ్ళకి అయినా పంపించండి మేమా చలాన్లు కట్టలేము అని ప్రాదేహపడుతున్నారు. పొట్ట కూటికి పది గంటలు ఆటో నడిపే ఓ డ్రైవర్ కి 34 వేల రూపాయలు చలాన్ విధిస్తే తాను ఎలా కట్టగలడు. ట్రాక్టర్ నడుపుకునే డ్రైవర్ కి దారుణంగా 59 వేల జరిమానా..? ఇలా చలాన్లు విధిస్తే పెద ప్రజలు కష్ట జీవులు తమ ఆస్తులని సైతం అమ్ముకునే పరిస్థితి కి దిగజారిపోతారు. మరి ఇలాంటి వారి గురించి ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది..? అని అంతటా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.

ఇలా ప్రజలు విలవిలబోతుంటే.. ప్రభుత్వం మాత్రం తన చర్యని సమర్ధించుకుంటుంది. తాజాగా ఈ విషయంపై స్పందించిన కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి మోటారు వాహన చట్టం రూపకర్త నితిన్ గడ్కరీ మాత్రం ప్రభుత్వాన్ని సమర్ధించుకుంటున్నారు. ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఏటా 5 లక్షలకు పైగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటి కారణంగా లక్షన్నర మంది వరకు మృత్యువాత పడుతుండగా, 3 లక్షల మంది తీవ్ర గాయాలకు గురవుతున్నారని గడ్కరీ తెలిపారు. మృత్యువాత పడుతున్న వారిలో 65 శాతం మంది 18 నుంచి 35 ఏండ్లలోపు వారేనని చెప్పారు. ఈ ప్రమాదాలను తగ్గించేందుకు భారీ జరిమానాలు తప్పనిసరి అని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలు చట్టాన్ని గౌరవించకపోయినా, దానికి భయపడకపోయినా, ఆ దేశం సురక్షితమైనది కాదు అని గడ్కరీ వ్యాఖ్యానించారు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు జరిమానాల మొత్తాన్ని పెంచడం ప్రభుత్వానికి కూడా ఇష్టం లేదని తెలిపారు. ఒడిశాలో రూ.47,500 జరిమానాకు గురైన ఆటోడ్రైవర్ మద్యం మత్తులో వాహనం నడిపాడని మంత్రి చెప్పారు. ఈ దేశంలో ఒక్కరు కూడా జరిమానా కట్టని రోజు రావాలని ఆయన ఆకాంక్షించారు.

Share.

Comments are closed.

%d bloggers like this: