పెళ్ళికి నిరాకరించిన ప్రియుడు..! పాయిజన్ తాగిన ప్రియురాలు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రేమించడం తప్పుకాదు ప్రేమని అడ్డు పెట్టుకొని మోసం చేయడం తప్పు. పెళ్లి చేసుకుంటానని మాట ఇవ్వడం తప్పు ఆ మాటని నిలబెట్టుకోకుండా ఉండటం చాలా పెద్ద తప్పు. ఇలాంటి తప్పే చేశాడు ఓ వ్యక్తి. తనని చాలా ప్రేమిస్తున్న అని మాయ మాటలు చెప్పి యువతిని లొంగదీసుకున్నాడు. ప్రేమ మాటలు చెప్పి తన కోరికలన్నీ తీర్చుకున్నాడు. చివరికీ పెళ్లి అన్న మాట వచ్చేసరికి మూహం తిప్పేశాడు. దిగ్భ్రాంతికి గురైన ఆ మహిళా ఆత్మహత్యా యత్నం చేసుకుంది.. చావు బ్రతుకు మధ్య కొట్టుమిట్టులాడుతుంది.

వివరాల్లోకి వెళితే.. తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన మంద ప్రశాంత్‌ అనే యువకుడు, ఓ యువతి ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి ఆ అమ్మాయిని నమ్మించాడు. మాయ మాటలు అబద్దపు హామీలను నమ్మిన యువతి ప్రియుడితో హద్దులు దాటేసింది. అప్పటి నుంచి పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడల్లా ప్రియుడి మొహం చాటేస్తూ వస్తున్నాడు. ఓపిక నశించి గట్టిగా అడిగేసరికి కుదరదని చెప్పేశాడు. నీచమైన మాటలు అన్నాడు.

దీంతో మోసపోయానని గ్రహించిన యువతి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యింది. దిక్కుతోచని స్థితిలో ఆత్మ హత్య చేసుకోవాలని నిశ్చయించుకుంది. గురువారం నాడు నేరుగా ప్రియుడి ఇంటి ముందుకు వెళ్ళి తన వెంట తెచ్చుకున్న విశాన్ని తాగేసింది. అపస్మారకంగా పడున్న యువతిని చూసిన కొందరు స్థానికులు వెంటనే ఆమెని మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించి ఆమె కుటుంబసభ్యులకు పోలీసులకి సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని చావు బ్రతుకు మధ్య కొట్టుమిట్టులాడుతుందని వైధ్యులు చెబుతున్నారు. ఫిర్యాదు నమోదు చేసుకున్నా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: