గన్ తో కాల్చుకుని ప్రేమజంట ఆత్మహత్య..! వాట్సాప్ వీడియో వైరల్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

పంజాబ్ కి చెందిన ఓ ప్రేమ జంట గురువారం నాడు ఆత్మహత్యకి పాల్పడింది. తమ ఆత్మహత్యకి ఎవరూ కారణం కాదని వాళ్ళు పేర్కొన్నారు.. ఈ విషయాన్ని ఫెస్బుక్ లో వాట్సాప్ లో పోస్ట్ చేసి ఆత్మహత్య చేసుకున్నారు. వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవ్వడంతో విషయం బయటకొచ్చింది. ఇద్దరూ గన్ తో కాల్చుకుని చనిపోయినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ విషాదం పంజాబ్ లో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. పంజాబ్ రాష్ట్రం గుజ్రాన్ గ్రామానికి చెందిన సిక్కు యువకుడు(25) దళిత యువతి(20) బాల్యం నుండి ప్రేమించుకుంటున్నారు. యువకుడు ఇంటర్ తో తన చదువుని ఆపి ఆపై పొలం పనులు చూసుకుంటున్నాడు. యువతి డిగ్రీ చదివింది. వీరు ప్రేమించుకుంటునట్టు ఎవ్వరికీ తెలియదు. ఒకవేళ ఇంట్లో తెలిసినా ఒప్పుకోరు అనే భావనలో ఉన్నారు. ఇక వయసుతో పాటు పెళ్లి చేసుకోవాలంటు ఇంట్లో వత్తిడ్లు పెరిగాయి.

ఇక ఏమి చేయాలఓ తెలియని స్థితి లో ఇద్దరు ఆత్మహత్య చేసుకోవాలని ఒక అభిప్రాయానికి వచ్చారు. ఆ యువకుడి పొలానికి వెళ్ళిన ఇద్దరు ఓ వీడియో తీసి తమ మిత్రులకి కుటుంభ సభ్యులకి పంపించారు.. వీడియో లో.. ‘ మేము ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లాలని నిర్ణయించుకున్నాం. దయచేసి నా కుటుంబ సభ్యులు, స్నేహితులను ఈ విషయమై ఇబ్బంది పెట్టకూడదని పోలీసులను కోరుతున్నా. నేను నా వాళ్లను చాలా కష్టపెట్టాను. అందుకు క్షమాపణలు చెబుతున్నా. మీరందరూ అంటే నాకెంతో ఇష్టం. భయంతో చచ్చిపోతున్నా అని నా ప్రత్యర్థులు భావించవచ్చు. కానీ వ్యక్తిగత కారణాల వల్ల విధిలేని పరిస్థితుల్లో ప్రాణాలు తీసుకుంటున్నా’ అని సదరు యువకుడు పేర్కొన్నాడు.

ఇక ఆ వీడియో కొంత సేపట్లోనే వైరల్ అవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సుదురు పొలానికి వెళ్ళి చూడగా ఇద్దరు మరణించి పది ఉన్నారు. పోలీసుల కథనం ప్రకారం యువకుడు ముందు గన్ తో తనని తాను కాల్చుకొని వెంటనే యువతిని కూడా కాల్చేశాడని తెలుస్తుంది. ఇద్దరి మృతదేహాలని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం.

Share.

Comments are closed.

%d bloggers like this: