కోట్ల కొలది వాడు..కోట్లాదిమందికి అన్నదాత..! కలియుగ దేవుడు..శ్రీ వెంకటేశ్వరుడు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

కలియుగ దేవుడు.. ఆపధ్బాందవుడు..! కొరిన కోరికలు తీర్చ దైవం.. ప్రతీ ఒక్కరికీ ప్రీతిపాత్రుడు.. ఎండుకొండలవాడు.. శ్రీ వెంకటేశ్వరుడు..! భక్తులు శ్రీనివాసుడి దర్శనం కొరకు రాత్రింబవళ్ళు వేచి చూస్తుంటారు ఈయనని చూడగానే జీవితం చరితార్ధం అయ్యిందని భావిస్తుంటారు. ఆయనకి తమకి తోచిందల్లా ఇవ్వడం భక్తుల ఆనవాయితీ. అందుకే భక్తులు ఆయనని వడ్డీకాసుల వాడుగా పిలుస్తుంటారు. ఆయనే కలియుగ దైవం తిరుమల లో కొలువైయున్న శ్రీనివాసుడు. తిరుపతికి వెళ్ళిన ప్ర్తాయీ భక్తుడు తమకి తోచిన దానాన్ని ఆ స్వామికి ఇస్తూ ఉంటారు అందుకే ఆయన ఆదాయం కోట్లలో ఉంటుంది. దేశం లోనే అత్యంత దానికుడైన స్వామి గా ఈయనకి గుర్తింపు ఉంది.

అత్యంత ఆదాయం కలిగిన ఆలయాలలో తిరుపతి ఆలయమే అగ్రస్థానంలో ఉండటం ఇందుకు నిదర్శనం. కోట్లాది రూపాయలు, లెక్కలేనంత ..లెక్కించలేనంత బంగారం, వజ్రాలు, వైఢూర్యాలతో అలరారుతున్న ఈ స్థలం భక్తులకు సేద దీరేలా చేస్తోంది. అనునిత్యం పూజలతో మనసు దోచుకుంటున్న ఈ క్షేత్రం గురించి ఎంత చెప్పినా తక్కువే. పామరుల నుంచి పండితుల దాకా, సామాన్యుల నుంచి దానవంతుల దాకా, పిల్లలు, పెద్దలు, వృద్ధులు ఇలా ప్రతి ఒక్కరికి ఆరాధ్య దైవంగా కొలువబడుతూ, కోరుకున్న వెంటనే కోరికలు తీరుస్తూ , ఆశీస్సులు అందజేస్తూ వినుతికెక్కారు స్వామీ, అమ్మవార్లు.

Tirupati-Balaji

Tirupati-Balaji

ఈ స్వామి తన ఆదాయాన్ని తనకు మాత్రమే ఖర్చు చేసుకోకుండా అనునిత్యం తన చెంతకి వచ్చే భక్తులకి కూడా ఖర్చు చేస్తుంటాడు. తిరుమలకి వచ్చిన ప్రతీ భక్తుడు ప్రసాదం తినకుండా ఉండదు.. ఆ రాత్రిని ఆకలి తో గడపడు. ప్రతీ ఒక్కరికీ అన్న ప్రసాదం పెడతారు. ప్రతీ రోజు రెండు పూటలా ఆహారం అందజేస్తారు. పైనున్న 7 వ కొండ నుండి కిందున్న అలిపిరి వరకు వచ్చిన భక్తులకి ప్రయాణికులకి ఒక్క చోట అని కాదు రైల్వే స్టేషన్ లోని వారికి బస్ స్టాండ్ లో ఉన్నవారికి, సత్రాల్లో ఉన్నవారికి.. ఇలా కొండకి ఎవ్వరొచ్చినా ఎప్పుడొచ్చిన్నా ఆహారం అందజేస్తారు. ఈ మహా ప్రసాదం పెట్టేందుకు ప్రత్యేకంగా భవనాలను నిర్మించింది. తిరుమలకు వచ్చే భక్తులు ఏ ఒక్కరు ఆకలితో ఉండడానికి వీలు లేదంటూ అప్పటి ఏపీ ముఖ్యమంత్రి, దివంగత నందమూరి తారక రామారావు ఈ మహోన్నతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 6 ఏప్రిల్ 1985 న ప్రారంభమైన ఈ మహా ప్రసాద వితరణ కార్యక్రమం గత 34 ఏళ్లుగా కొనసాగుతోంది. లక్షలాది భక్తుల ఆకలి తీరుస్తోంది. దాదాపు 1100 కోట్ల రూపాయలు విరాళాల రూపేణా టీటీడీకి అందాయి. ఈ డబ్బులను డిపాజిట్ చేయడం వల్ల వచ్చిన వడ్డీతోనే అరుదైన అన్నదాన కార్యక్రమం కొనసాగుతోంది. ఒక్క అన్నదానమే కాదు టిఫిన్లు, పాలు, టీ, కాఫీ , మజ్జిగ అందజేస్తోంది టీటీడి. ఆనాడు ఆ మహానుభావుడు ఎన్టీఆర్ చేసిన ఈ ఆలోచన ఈరోజు లక్షలాది భక్తుల కడుపులు నింపుతోంది. ఈఓ కూడా ధన్య జీవులే . గోవిందా గోవిందా శ్రీనివాసా గోవిందా ..ఆపద మొక్కుల వాడా గోవిందా. అన్నదాతా సుఖీభవ సుఖీభవ…!

Share.

Comments are closed.

%d bloggers like this: