రిచ్ గర్ల్ చేస్తే డేటింగ్.. పూర్ గర్ల్ చేస్తే వ్యభిచారమా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

క్యాస్టింగ్ ఉదంతంతో ఇండస్ట్రీని హడలెత్తించిన శ్రీరెడ్డి.. ఆ రోజు నుంచి ఏదొక వివాదంపై స్పంధిస్తూనే ఉంది. తనకు సంబంధం ఉన్నా..లేకున్న ఎదోకదానిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ…అందరి దృష్టిని ఆకర్షించి వివాదాస్పద నటిగా పేరు తెచ్చుకుంది. అయితే తాజాగా శ్రీరెడ్డి చేసిన హాట్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఈ సారి ఆమె ఎవరిని టార్గెట్ చేసి కామెంట్స్ చేయలేదు…చాలా మందిలో ఉన్న ప్రశ్ననే ఆమె కుండ బద్దలు కొట్టి మరీ చెప్పింది..ఇంతకీ ఆ కామెంట్స్ ఏంటంటే… డేటింగ్ పేరుతో మగ, ఆడ కలవడం.. మాట్లాడుకోవడం.. రిలేషన్‌ను కంటిన్యూ చేయడం ఇప్పుడు యూత్‌లో ఉన్న నయా ట్రెండ్. అయితే ఈ డేటింగ్‌లో చాలా రకాలు ఉంటాయి. కొందరైతే డేటింగ్ పేరుతో లాంగ్ ట్రిప్‌లు వేయడం.. సెక్సువల్‌గా కూడా కమిట్ కావడం లాంటివి కూడా ఉంటాయి. ఇదే ఇష్యూని రేస్ చేస్తూ ఆలోచింపచేసే పోస్ట్ పెట్టింది వివాదాస్పద నటి శ్రీరెడ్డి. ‘ఒక ధనవంతురాలైన అమ్మాయి చాలా మందితో వెళితే దాన్ని డేటింగ్ అంటున్నారు.. ఓ పేద అమ్మాయి అదే పని చేస్తే ఆమెను వ్యభిచారి లేదా లం*** అంటున్నారు’ అంటూ ఏకిపారేసింది శ్రీరెడ్డి. కాగా, శ్రీ రెడ్డి చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Share.

Comments are closed.

%d bloggers like this: