ఎవరీ ‘బాబు’..‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ లుక్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

వివాదం అనే మాటలను ఇంటి పేరుగా మార్చుకుని వివాదాస్పద దర్శకుడిగా మారిన వర్మ తాజా చిత్రం ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’. వంగవీటి, లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో ఇండస్ట్రీలో పలు వివాదాలు రాజేసిన వర్మ.. ఇప్పుడు ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అనే వివాదాస్పద చిత్రాన్ని రూపొందిస్తూ, రెండు కులాల మధ్య చిచ్చు పెడుతూ.. రెచ్చగొట్టేలా ఇప్పటికే టీజర్, ప్రోమో, సాంగ్‌లను వదలిపెట్టాడు. తాజాగా రేపు (సెప్టెంబర్ 10) ఉదయం 9.27 గంటలకు ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేస్తున్నట్టుగా ప్రకటిస్తూ ఒక ఫోటోను షేర్ చేశాడు వర్మ.

ప్ర‌పంచంలో మ‌నుషుల్ని పోలిన మ‌న‌షులు ఏడుగురు ఉంటారంటారు. కానీ మ‌న‌కు ఎక్క‌డా కూడా క‌నిపించ‌రు. సినిమాల్లో త‌ప్ప బ‌య‌ట అచ్చంగా అలాగే ఉండే వ్య‌క్తుల్ని ప‌ట్టుకోవ‌డం మామూలు విష‌యం కాదు. కానీ వ‌ర్మ‌కు మాత్రం అది భ‌లే తెలిసిపోతుంది. ఎక్క‌డో ఏదో బూత‌ద్దం పెట్టి వెతికేసిన‌ట్లు.. మ‌నుషుల్ని పోలిన మ‌నుషుల్ని ప‌ట్టుకొస్తున్నాడు వ‌ర్మ‌. గతంలో వీర‌ప్ప‌న్, క‌స‌బ్, వంగ‌వీటి, నయీమ్ లాంటి వాళ్లను పట్టుకొచ్చిన వర్మ తాజాగా చంద్రబాబునాయుడును తీసుకొచ్చాడు. వర్మ ఇవాళ అచ్చుగుద్దినట్టుగా చంద్రబాబు పాత్రలో ఉన్న వ్యక్తి ఫొటోను షేర్ చేస్తూ…ఈ పాత్ర ఎవరిదో గెస్ చేయండి.. ఈ కొత్త నటుడు ఎవరి పాత్రలో నటిస్తున్నాడు అంటూ ఫొటోను షేర్ చేశారు. అయితే ఈ ఫొటోలో చంద్రబాబుని పోలిన వ్యక్తి విలన్ మాదిరి కనిపిస్తున్నారు. శాంపిల్ లుక్‌తోనే హీట్ పెంచేసిన వర్మ.. రేపటి మోషన్ పోస్టర్‌తో ఎలాంటి వివాదాన్ని రాజేస్తాడో ఈ వర్మ చూడాలి.

Share.

Comments are closed.

%d bloggers like this: