నచ్చిన పార్టీకి ఓటేస్తే చంపేస్తారా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

వైసీపీ నేతల దుశ్చర్యలతో 70 ఏళ్ల రాజ్యాంగం.. 73 ఏళ్ల స్వాతంత్ర్యం పరిహారం పాలయ్యాయని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రక్తం చిమ్మి, ఎముకలు జల్లి యజ్ఞాల్ని భగ్నం చేయడం పురాణాల్లోనే విన్నాం కానీ.. ఇప్పుడు అంతకు మించిన రాక్షస కృత్యాలను రాష్ట్రంలో చూస్తున్నామని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు విరుచుకుపడ్డారు. దేశంలో ప్రతి పౌరుడికి స్వేచ్ఛగా నివసించే హక్కు ఉందన్నారు. ప్రాణాలు, ఆస్తులు కాపాడుకునే హక్కు రాజ్యాంగమే కల్పించిందని పేర్కొన్నారు. అలాంటిది వైసీపీ వాళ్ల బెదిరింపులతో సొంత ఊళ్లను వదిలేసి పరాయి గ్రామాల్లో తలదాచుకొనే పరిస్థితి నెలకొందన్నారు. నచ్చిన పార్టీకి ఓటేస్తే చంపేస్తారా? అని వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ‘‘ఆత్మగౌరవంతో జీవించే హక్కును కాలరాస్తారా? పంట పొలాల్లోకి వెళ్లకుండా రైతులను అడ్డుకుంటారా? రోడ్డుకు అడ్డంగా గోడలు కడతారా? కష్టపడి పెంచిన చీనీ చెట్లను నరికేస్తారా? పాడి గేదెలకు విషం పెట్టి చంపుతారా? ఎస్సీలు, ముస్లిం మైనారిటీల ప్రాణాలతో చెలగాటం ఆడతారా? బోర్లు పూడ్చేయడం, పైపులు కోయడం.. ఇవన్నీ రైతుల కష్టం తెలిసినవాళ్లు చేసే పనులేనా?’’ అని వైసీపీ నేతలు, కార్యకర్తల తీరుపై చంద్రబాబు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. మానవత్వం ఉన్నవారంతా వైసీపీ అరాచకాలను ఖండించాలని, బాధితుల పక్షాన ప్రజా సంఘాలన్నీ నిలబడాలన్నారు. వైసీపీ ప్రభుత్వ బాధితుల పునరావాసానికి చేదోడుగా ఉండాలని పిలుపునిచ్చారు.

Share.

Comments are closed.

%d bloggers like this: