సోమిరెడ్డికి నోటీసులు..! గంటలో సమాదానం చెప్పాలని డిమాండ్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పై భూ వివాదంలో భాగంగా కేసు నమోదయ్యింది.. ఈ మేరకు ఆయనకి నోటీసులు కూడా అందాయి. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం ఇడిమేపల్లి గ్రామంలో తలెత్తిన భూవివాదంలో కొంత కాలంగా ఆయనపై ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలపై ఆయన సమాధానం చెప్పాలని ఆయనకి ఇచ్చిన నోటీసులో తెలిపారు. నెల్లూరు రూరల్‌ సర్కిల్‌ సీఐ రామకృష్ణ పేరిట తయారైన నోటీసును వెంకటాచలం ఎస్‌ఐ కరీముల్లా శుక్రవారం అల్లీపురంలోని సోమిరెడ్డి నివాసానికి వెళ్లి నోటీసులు అందజేశారు.

ఇదిమేపల్లి ఠానా లో కొంత కాలం క్రితం సోమిరెడ్డి పై కొందరు స్థానికులు కేసు నమోదు చేయగా.. సంబంధించిన పూర్వాపరాలను విచారించేందుకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. నిన్న సాయంత్రం అంటే 6 గంటలకి సోమిరెడ్డికి నోటీసులు అందజేసిన పోలీసులు ఆయనకి కేవలం ఒక గంట సమయం మాత్రమే ఇచ్చి అంతలోపు సమాదానం చెప్పాలని ఆయనకి తెలియజేశారు.

దీనిపై స్పందించిన సోమిరెడ్డి… గంట సమయంలో విచారణకు ఎలా హాజరుకాగలం..? వ్యవధి ఇవ్వరా.? అని ప్రశ్నించారు. పైగా ఈ నెల మూడో తేదీన నోటీసు జారీ చేసినట్లు అందులో ఉండటంతో దానిని సరిచేయాలని సోమిరెడ్డి సూచించారు. అనంతరం ఉన్నతాధికారులతో మాట్లాడిన ఎస్‌ఐ… సోమవారం హాజరుకావాలని సోమిరెడ్డిని కోరారు. దీనికి ఆయన సమ్మతించారు. 1933 నుండి ఉన్న పత్రాలని అన్నీ అప్పగిస్తామని న్యాయపరమైయన పత్రాలను అందజేస్తామని ఆయన వెల్లడించారు.

Share.

Comments are closed.

%d bloggers like this: