అనుమానం పెనుభూతంగా మారీ భార్య గొంతు నులిమి..!

Google+ Pinterest LinkedIn Tumblr +

వివాహేతర సంబంధాలు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. వివాహేతర సంబంధాల పేరిట జరుగుతున్న హత్యల సంఖ్య మరింత పెరిగిపోయింది. అనుమానాలు పెరుగుతున్నాయి అవి కాస్త పెద్దవిగా మారి హత్యలకి దారి తీస్తున్నాయి. ఈక్రమంలో ఓ వ్యక్తి తన భార్య పై అనుమానం పెంచుకొని గొంతు నూలుమి చంపేశాడు. కోపాన్ని అదుపులో పెట్టుకోకుండా పూర్తి వివరాలు తెలుసుకోకుండా ఇలాంటి దారుణాలకి పాల్పడటం అసలైన దారుణం.

వివరాల్లోకి వెళితే.. గుంతకల్లుకు చెందిన శివయ్య-వాణి అలియాస్ ఓబులమ్మ (38) భార్యాభర్తలకి 20 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. వీరికి ముగ్గురు సంతానం. ఉపాడి కోసం దంపతులు తిరుపతికి వలస వెళ్లారు. శివయ్య ఆటో డ్రైవర్ గా విడులు నిర్వహిస్తున్నాడు. తనకి నిత్యం పని ఉండటం వల్ల ఇంట్లో చాలా తక్కువ సమయం గడిపేవాడు. భార్యతో ఎక్కువగా గడపకుండా ఆమెనే అనుమానించడం మొదలు పెట్టాడు. తనకి ఏదో వివాహేతర సంబంధం ఉందని నిశ్చయించుకున్నాడు.. దీంతో ఇద్దరికీ మధ్య ఎప్పుడూ గొడవలే జరిగేవి.

ఈ కారణంతో ఏడాది క్రితం శివయ్య పిల్లలని తీసుకొని గుంతకల్లు కి తిరిగి వెళ్లిపోయాడు. అప్పటినుండి తన భార్య తిరుపతిలోనే ఒంటరిగా ఉంటుంది. విషయాన్ని సద్దుబాటు చేయడానికి ఊరి పెద్దలు జోక్యం చేసుకొని ఇద్దరినీ కలిసి ఉండమన్నారు. భార్యని తీసుకువెళ్లడానికి వచ్చిన శివయ్యతో భార్య తిరిగి వెళ్లడానికి నిరాకరించింది. నిరాకరించిన భార్య పై శివయ్యకి అనుమానం పెను భూతంలా మారి తన భార్యపై కోపం పెంచుకున్నాడు. అక్కడికక్కడే చంపేయాలని నిశ్చయించుకొని ఆమె గొంతు నులిమి చంపేశాడు. అనంతరం అక్కడనుండి పరారయ్యాడు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శివయ్య గురించి ముమ్మరంగా గాలిస్తున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: