చట్టం మీకేమి చుట్టం కాదు..! తెలంగాణ డీజీపీ కీ చలాన్..! కట్టక తప్పదు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

చట్టానికి ఎవ్వరూ చుట్టం కాదని..! చట్టం అందరికీ సమానం అని అందరికీ ఒకే చట్టం వర్తిస్తుందని తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు నిరూపించారు. డైరెక్ట్ గా తెలంగాణ డీజీపీ కే జరిమానా విదించారు. తనకి 1135 రూపాయల చలాన్ విదించారు. ప్రస్తుతం ఈ వార్తా వైరల్ అవుతుంది.

వివరాల్లోకి వెళితే చట్టం ఎవ్వరికీ చుట్టం కాదని సామాన్యుడికి సీఎంకి..! డ్రైవర్ కి డీజీపీ కి అందరికీ ఒకే చట్టం వర్తిస్తుందని నిరూపించారు హైదరబాద్ ట్రాఫిక్ పోలీసులు. ట్రాఫిక్ నియమాలని ఉల్లంఘించినందుకు రాంగ్ రూట్ లో డీజీపీ మహేందర్ రెడ్డి కారు వెళ్లినందుకు ఆయనకి జరిమానా విదించి శబాష్ అనిపించుకున్నారు. ఈ నెల 3న డీజీపీకి చెందిన కారు సంగారెడ్డిలో రాంగ్ రూట్ లో వెళుతుండగా ఎవరో సామాన్యుడు ఫొటో తీసి సోషల్ మీడియా ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫొటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవ్వడంతో కారు వివరాలు బయ్తకి తీశారు. వివరాలా ఆధారంగా ఆ కారు తమ బాస్ డీజీపీ మహేందర్ రెడ్డీది అని తేలడంతో ఆయనకి 1135 రూపాయల ఫైన్ విదిస్తూ చలాన్ పంపారు. దీంతో ఒక్కసారిగా ఈ విషయం వైరల్ అవుతుంది.

Share.

Comments are closed.

%d bloggers like this: