తమిళుల ‘అమ్మ’ గా రమ్యకృష్ణ..! జయా లలితా బయోపిక్ త్వరలో..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆమె ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమలు లోకి తెచ్చిన ఎన్నో సంక్షేమ పథకాలని అభివృద్ది పనులని ఈతరం ముఖ్యమంత్రులు ఆదర్శంగా తీసుకుంటున్నారు.. అమ్మా క్యాంటీన్ లని ఆధార్శంగా తీసుకున్న కేసీఆర్ బాబు లు అమ్మ క్యాంటీన్ ల తరహాలోనే క్యాంటీన్ లని ఏర్పాటు చేసి 5 రూపాయలకే నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నారు..! ఇలా ఒకటి కాదు చెప్పుకుంటూ పోతే చాలా వస్తాయి..! ఆమె ప్రతీ పథకం దేశానికి ఆదర్శం ఆమే నడవడి అనేక మందికి స్ఫూర్తి. అందుకే తమిళ ప్రజలు ఆమెకి 6 సార్లు ముఖ్యమంత్రి అవ్వడానికి అవకాశం ఇచ్చారు.

అలాంటి జయ లలిత జీవితాన్ని ఆదారంగా తీసుకొని బయోపిక్ ని తెరకెక్కిస్తున్నారు. తన జీవితాన్ని చూపించదానికి మూడు గంటల సినిమాలో సరిపోదని భావించిన నిర్మాతలు ఆమె జీవితాన్ని వెబ్ సిరీస్ రూపకంగా చూపించాలని డిసైడ్ అయ్యారు. వెబ్ సిరీస్ లో జయా లలితా ని రెండు విదాలుగా చూపించనున్నారు యంగ్ జయ లలితాగా రాజకీయాల్లోకి వచ్చిన తరువాతి జయ లలితాగా చూపించనున్నారు. వెబ్ సిరీస్ లోని జయ లైలిత పాత్రని టాలీవుడ్ శివగామి రమ్య కృష్ణ చేస్తున్నారు. కాగా యంగ్ జయలలితా పాత్రలో అనిఖా సురేంద్రన్ కనిపిస్తారు. ఇక తమిళుల ప్రియతమ నటుడు ప్రియతమా ముఖ్యమంత్రి జయ లలితా గురువు సూపర్ స్టార్ ఎం‌జీఆర్ పాత్రని నటుడు ఇంద్రజిత్ సుకుమారన్ పోసితున్నారని సమాచారం. ఈ వెబ్ సిరిస్స్ కి క్వీన్ అనే పేరుని ఖరారు చేశారు. క్వీన్ అనేది జయలలితా సినిమాల్లో ఉన్నప్పటి బిరుదు. కాగా ఈ వెబ్ సిరీస్ ని ట్యాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ వసుదేవ్ మీనన్, ప్రశాంత్ మురుగేశన్ సంయుక్తంగా డైరెక్ట్ చేస్తున్నారు. ఎం‌ఎక్స్ ప్లేయర్ ఆధ్వర్యంలో కథ నిర్మాణం అవుతుంది. త్వరలో ఎం‌ఎక్స్ ప్లేయర్ ద్వారా ప్రేక్షకుల ముందుకి రానుంది. తమిళం లోనే కాకుండా తెలుగు హిందీ కన్నడ భాషల్లోనూ ప్రసారం చేస్తున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: