అనుమానాస్పద రీతిలో ఐ‌ఎఫ్‌ఎస్ అధికారి..ఆత్మహత్య..! ఆ కారణంతో..!

Google+ Pinterest LinkedIn Tumblr +

చిన్న చిన్న గవర్నమెంట్ పరీక్షలు పాసవ్వడమే గగనంగా ఉన్నాయి రోజులు.. ఇక సివిల్స్ క్వాలిఫై అవ్వాలంటే దాదాపుగా అసాధ్యమే..! సివిల్స్ క్వాలిఫై అవ్వాలంటే ఎంతగానో కష్టపడాలి..! రాత్రింబవళ్ళు శ్రమించి నిద్రాహారాలు మరిచి కృషి చేస్తే తప్ప సివిల్స్ క్వాలిఫై అవ్వలేరు. సివిల్స్ క్వాలిఫై అయ్యారు అంటే వారు చాలా తెలివైన వారు ఎంతో ఒత్తిడిని కూడా తట్టుకోగల శక్తి ఉన్న వారు. అలాంటి వాళ్ళు కూడా వత్తిడికి గురవుతారా..? ఆత్మహత్యలకి పాల్పడతారా..? పరీక్ష పాస్ అవ్వడం కన్నా విధులు నిర్వహించడమే కష్టమా..? పరీక్ష వత్తిడి తట్టుకున్న వాళ్ళు ఉద్యోగ వత్తిడిని తట్టుకోలేరా..? అనే ప్రశ్నలు ఇప్పుడు కర్ణాటక అంతటా వస్తున్నాయి. బెంగళూరు లో ఐఎఫెఎస్ అధికారి ఆత్మహత్య చేసుకోవడమే ఈ ప్రశ్నలకి తెర తీసాయి. ఐఎఫ్ఎస్ అధికారి తన అపార్ట్ మెంట్ లో అనుమానాస్పద రీతిలో మరణించి ఉండటమే ఇందుకు కారణం.

కర్ణాటక భారత అటవీ సేవల (ఐఎఫ్ఎస్) అధికారి అవతార్ సింగ్ ఆదివారంనాడు బెంగళూరు యలహంకలోని ప్రిస్టేజ్ మౌంట్ అపార్ట్‌మెంట్‌‌లో అనుమానాస్పద స్థితిలో మరణించి ఉండటం కర్నాటక లో కలకలం రేపుతుంది. ఘటనా స్థలానికి చేరుకున్న న్యూ టౌన్ పోలీసులు వివరాలని సేకరిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం అవతార్ సింగ్ ఆత్మ హత్యకి పాల్పడి ఉంటారు అని తెలుస్తుంది. కర్ణాటక సీఎం ఎడ్యురప్ప నిర్వహించిన శాఖల్లో ఐఎఫ్ఎస్ శాఖా కూడా ఒకటి. అవతార్ సింగ్ కొన్ని రోజులుగా సెలవు తీసుకొని ఇంట్లోనే ఉంటున్నారు ఆయన తిరిగి శనివారం నాడు ఆఫీస్ లో అడుగు పెట్టారు.. ఇక ఆయనకి అక్కడ ఎదురయిన పరిస్థితుల వల్లే తీవ్ర వత్తిడికి గురయ్యుంటుందని ఆ వత్తిడుల కారణంగానే ఆయన ఆత్మహత్య కి పాల్పడ్డారని పోలీసులు భావిస్తున్నారు. ఆయన హత్య మాత్రం అనుమానాస్పదంగా ఉందని సివిల్స్ చదివి విధులు నిర్వర్తించిన వారు ఇలా ఆత్మహత్య కి పాల్పడరని దీని వెనుక ఏదో కుట్ర ఉందని సోషల్ మీడియా లో పలువురు ట్వీట్లు చేస్తున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: