సైరా కి జక్కన్న సహాయం..! సైరా టీమ్ లోకి రాజమౌళి ఎంట్రీ..!

Google+ Pinterest LinkedIn Tumblr +

మెగాస్టార్ చిరంజీవి తన 150 వ సినిమాగా ఖైదీ నంబర్ 150 సినిమా చేశారు. సినిమాకి మంచి హిట్ దక్కింది. ప్రేక్షకాదరణ కూడా అదే స్థాయిలో వచ్చింది. ఇక ఆ సినిమా తరువాత చిరు మళ్ళీ చాలా రోజుల గ్యాప్ తీసుకున్నాడు. చాలా రోజుల గ్యాప్ తరువాతా తెల్ల దొర పై మొట్టమొదటిసారిగా పోరాడిన తెలుగు వీరుడు సైరా నరసింహా రెడ్డి జీవిత కథ ని ఆధారంగా తీసుకొని సైరా గా మరోసారి మన ముందుకి రానున్నాడు. ఈ సినిమాని చిత్రబృందం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాని సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు.. కాగా మెగాస్టార్ చిరంజీవి కొడుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాని నిర్మిస్తున్నాడు.

అయితే ఇప్పుడు కొత్తగా దర్శక ధీరుడు రాజమౌళి ఈ సినిమాకోసం పని చేస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి. సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయిపోయింది ఇలాంటి సమయంలో రాజామౌళి ఎంట్రీ ఏంటి అని అందరూ తికమక పడుతున్నారు. సినిమా తెరకెక్కించడం పూర్తవుతే సరిపోదు.. సినిమాకి ప్రీ ప్రొడక్షన్ పనులు చాలా ఉంటాయి. అన్నీ పూర్తవుతే తప్ప సినిమా రిలీజ్ కి సిద్ధం అవ్వదు. ఇక రాజమౌళి కి బాహుబలి సినిమాతో అన్నీ రంగాల్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. దర్శకత్వం, ప్రమోషన్, ప్రీ ప్రొడక్షన్ ఇలా అన్నీ రంగాల్లో జక్కన్నకి మంచి అనుభవం ఉంది. ఇక ఆ అనుభవాన్ని రామ్ చరణ్ సైరా సినిమా కి ఉపయోగించాలని జక్కన్న ని కోరాడు. జక్కన్న కూడా ఇందుకు ఒకే చెప్పినట్టు సమాచారం. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులకి ప్రమోషన్స్ కి రాజమౌళి సహాయం తీసుకోబోతున్నాడు. ఇక చూడాలి రాజమౌళి అనుభవం ఈ సినిమాకి ఎలా ఉపయోగపడబోతుందో..!

Share.

Comments are closed.

%d bloggers like this: