చంద్రయాన్ 2 ఆచూకీ కనుక్కున్న ఇస్రో..! చరిత్ర సృష్టించారు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

భారత దేశ ప్రతిష్టని 130 కోట్ల ప్రజల ఆశలని తన భుజాల పై వేసుకొని నింగికేగింది.. చంద్రయాన్ 2. కే శివన్ ఆధ్వర్యంలో శాస్త్రవేత్తలు రాత్రింబవళ్ళు కష్టపడి ఈ ప్రోయోగాన్ని చేశారు. ప్రయోగం దాదాపుగా పూర్తయ్యింది చంద్రుడి కక్ష లోకి ధూసుకెళ్లిన విక్రమ్ ల్యాండర్ మరి కొన్ని క్షణాల్లో చంద్రుడి పై ల్యాండ్ అవ్వనుంది. ప్రపంచం అంతా ఉత్కంటకి గురయ్యింది ఎందుకంటే చంద్రుడి సౌత్ పోల్ పై ల్యాండ్ అవ్వనున్న మొట్టమొదటి శాటిలైట్ గా చంద్రయాన్ 2 మరికొన్ని క్షణాల్లో చరిత్ర సృష్టించబోతుంది. ప్రయోగం దాదాపుగా పూర్తయ్యే దశలో ఉండగా సాంకేతిక సమస్యలు తలెత్తి సిగ్నల్ కట్ అయ్యింది. సిగ్నల్ కట్ అవ్వడంతో విక్రమ్ ల్యాండర్ ఆచూకీ కోల్పోయారు శాస్త్రవేత్తలు. మరో 0.74 సెకండ్లలో చంద్రుడిపై ల్యాండ్ అవ్వాల్సిన విక్రమ్ ల్యాండర్ ఆచూకీ ఒక్కసారిగా కోల్పోయేసరికి అందరూ నిరాశపడ్డారు. ఇస్రో చైర్మెన్ కే శివన్ కంట నీరు పెట్టుకున్నారు.

దేశం అంతా ఇస్రో ని ఎంతగానో మెచ్చుకున్నారు మీతో మేమున్నాం అని ఇస్రో కి సర్దిచెప్పారు. ప్రధాని శివన్ ని హత్తుకున్నారు. అనంతరం శివన్ మాట్లాడి పూర్తి వివరాలని వెల్లడించారు. విక్రమ్ ల్యాండర్ తో మరోసారి కాంటాక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తామని ఆయన పేర్కొన్నారు. ఆయన మాట అన్న ప్రకారమే విక్రమ్ ల్యాండర్ ఆచూకీ కనిపెట్టారు. వీరు ల్యాండ్ చేయాల్సిన ప్రాంతం కంటే 500 మీటర్ల దూరంలో విక్రమ్ ని కనుకున్నారు. విక్రమ్ సక్రమంగా ల్యాండ్ అయ్యిందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. చంద్రుడి సౌత్ పోల్ పై శ్యాటిలైట్ ని లాంచ్ చేసిన మొట్టమొదటి అంతరిక్ష సంస్థ గా ఇస్రో చరిత్ర సృష్టించిందని వారు పేర్కొన్నారు. మరలా విక్రమ్ తో కాంటాక్ట్ లోకి వెళ్ళేందుకు ప్రయత్నింస్తామని వారు తెలియజేశారు. మొత్తానికి భారత దేశ పరువు ప్రతిష్టలని ఇస్రో ప్రపంచానికి తెలియజేయడమే కాక చరిత్ర సృష్టించింది.

Share.

Comments are closed.

%d bloggers like this: