వివాదం రేపిన కేసీఆర్ శిల్పాన్ని తొలగించిన అధికారులు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

మనం ఎన్నో గుళ్ళు తిరిగాము ఎన్నో గోపురాలు చూసాము.. కానీ ఎక్కడైనా ఒక సీఎం శిల్పాన్ని కానీ ప్రతిమ కానీ గొది గోడల పై చూసామా..? రాజకీయ నేతల శిల్పాలు ఎన్నడూ చూసుండరు..? కానీ కొన్ని రోజుల ముందు కనుక మీరు తెలంగాణ లోని యాదాద్రీకీ వెళ్ళి ఉంటే మీరు మాత్రం తప్పకుండా అవ్వకయ్యే వాళ్ళు..! అక్కడ గుడి గోడలపై సీఎం కేసీఆర్ శిల్పాన్ని కారు గుర్తుని చూసుండే వాళ్ళు. గుడి బొమ్మలకంటే టీఆర్ఎస్ పార్టీ బొమ్మలే ఎక్కువగా కనిపించి ఉండేవి. తెలంగాణ ఉద్యమాన్ని ఉద్యమం చేసిన నేత కేసీఆర్ ని ఆ గోడలపై చూపాలని భావిష్యత్తు తరాలకి ఉద్యమ పోరాటం గురించి తెలిపేందుకు అలా చేశామని అక్కడి శిల్పులు చెబుతున్నారు. అది ఏమైనా అయ్యుండొచ్చు కానీ హింధు సంఘాలు, ప్రజలు, ప్రతి పక్షాలు మాత్రం ఆ చర్యని తప్పుబడుతున్నారు. కేసీఆర్ పై ఆయన ప్రభుత్వం పై మండి పడుతున్నారు.

దేశానికి స్వతంత్రం సాధించిన జాతి పితా మహాత్మా గాంధీ విగ్రహాలు శిల్పాలే ఎక్కడ లేవు. తెలంగాణ సాధించినందుకు శిల్పాల్ని పెట్టేసుకుంటున్నావా..? ఎందుకు అంతా సెల్ఫ్ డబ్బా..? అని ప్రతిపక్షాలు ఆయన పై మంది పడుతున్నాయి. గుడిలో రాజకీయం ఏంటి ఆ ప్రతిమలు ఏంటి అని ఆలయ సంఘాలు హిందూ సంఘాలు కేసీఆర్ పై మండిపడుతున్నాయి. ఈ ఫోటోలు సోషల్ మీడియా లో కూడా చాలా ట్రోల్ అయ్యాయి. ఒక్కసారిగా ఈ విషయం రాష్ట్రం అంతా చర్చ అయ్యేసరికి మరి ఏం డిసైడ్ అయ్యారో కానీ యాదాద్రి లో చెక్కిన కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ శిల్పాలని తొలగిస్తున్నారు. ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయి.. సీఎం కార్యాలయంలో శనివారం జారీ చేసిన ఆదేశాలతో దైవిక సంబంధిత బొమ్మలు మినహా మిగతా అన్ని రకాల చెక్కడాలను చెరిపేసినట్లు వైటీడీఏ ప్రధాన స్థపతి ఆనందచారి వేలు తెలిపారు. ఆ బొమ్మల స్థానంలో లతలు, పద్మాలు, హంసలతో పాటు దైవ సంబంధిత బొమ్మలను చెక్కబోతున్నారని ఆయన తెలిపారు.

Share.

Comments are closed.

%d bloggers like this: