భర్తని చంపడానికి ప్రియుడితో కలిసి సుపారి..! తల పై బండ విసిరి..!

Google+ Pinterest LinkedIn Tumblr +

స్నేహితుడి భార్య అని కూడా చూడకుండా వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. భర్తకి నమ్మకంగా ఉండాల్సిన భార్య కూడా ఇందుకు సహకరించింది. భర్తకి తెలియడంతో వొద్దు అని చెప్పాడు.. ఆపమని హెచ్చరించాడు. అయినా కూడా ఆపకుండా అతనని హతమార్చాలని డిసైడ్ అయ్యింది. ప్రియుడితో ప్లాన్ వేయించింది. ప్రియుడు భార్య కలిసి దుండగులకి సుపారి ఇచ్చి స్కెచ్ వేయించారు.. ఆ పిచ్చి భర్తని హతమార్చారు..! విషయం వెలుగులోకి వచ్చింది చట్టం నుండి తప్పించుకోలేక దొరికిపోయి కటకటాల మధ్య విలవిలలాడుతున్నారు.

వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి జిల్లా పుల్కల్‌ మండలం ముదిమాణిక్యం గ్రామానికి చెందిన దివాకర్‌ తన భార్య, పిల్లలతో కలిసి పటాన్‌చెరులోని చైతన్యనగర్‌ కాలనీలో నివాసం ఉంటున్నాడు. జీవనాన్ని గడపడానికి స్థానికంగా ట్రాక్టర్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. జీవనాన్ని గడపడం కోసం శంకర్‌పల్లి మండలం శేరిగూడెం గ్రామానికి చెందిన మైలారం జంగయ్య అనే వ్యక్తి వద్ద చిన్న చిన్న అప్పులు చేయడం మొదలు పెట్టాడు. ఇక ఆ అప్పుల తో పాటు జంగయ్య తో దివాకర్ కి స్నేహం కూడా ఏర్పడింది.

జంగయ్య తరచూ దివాకర్ ఇంటికి వెళ్తూ వాస్తు ఉండే వాడు. ఈక్రమంలో జంగయ్య కి దివాకర్ భార్యకి అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ అక్రమ సంబంధాన్ని భర్త దివాకర పసిగట్టి తన భార్యని అన్నీ ఆపేయమని హెచ్చరించాడు. అయినా కూడా తన భార్య ఆపలేదు. జంగయ్య తో అలానే గడిపేది. ఇక దివాకర్ తమ బంధానికి మాటిమాటికి అడ్డు చెబుతున్నాడని అతనని హంతం చేయాలని భార్య జంగయ్య డిసైడ్ అయ్యారు.

ప్లాన్ ప్రకారం ఇద్దరు దుండగులకి పరమేశ్, ప్రకాశ్‌ కి జంగయ్య సుపారి ఇచ్చాడు మొత్తం 2 లక్షలకి డీల్ చేసుకున్నారు. జంగయ్య అడ్వాన్స్ గా 1.3 లక్షలను దుండగులకి ఇచ్చాడు. పథకం ప్రకారం సేనివారం రాత్రి ఆ దుండగులు దివాకర్ ని ముదిమాణిక్యం గ్రామానికి బయల్దేరారు. మార్గమధ్యలో పెద్దకంజర్ల గ్రామ శివారులో ముగ్గురూ కలిసి దివాకర్ తలపై బండరాయితో కొట్టి దారుణంగా హత్య చేశారు. స్థానికుల ఫిర్యాదు మేరకు రంగం లోకి దిగిన పోలీసులు దివాకర్ కాల్ డేట్ తీయగా వివరాలు వెలుగు లోకి వచ్చాయి. భర్త ని చంపించి తాను నేరస్తురాలిగా మారి పిల్లల జీవితాలు చిన్నా బిన్నం చేసింది సురేఖ.. ప్రస్తుతం నిందితులు సురేఖ జంగయ్య ప్రకాష్ పరమేష్ లు కటకటాల నడుమ దొషులుగా ఉన్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: