ప్రపంచం పైనే కన్నెశాడు..! వ్యాపారాల మగధీర…ముఖేష్ అంబానీ..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆయన ఏ వ్యాపారం పై కన్నెస్తాడో దాన్ని తప్పకుండా స్టార్ట్ చేస్తాడు. స్టార్ట్ చేయడమే కాదు ఆ వ్యాపారంలోనే దిగ్గజంలా మారుతాడు. ఇన్వెస్టర్లకి ఆయన మాట చాలు..! షేర్ హోల్డర్లకి ఆయన చిరునవ్వు చాలు.. ఆయనే భారత దేశంలోనే అత్యంత ధనికులలో ఒకరు భారత వ్యాపార సామ్రాజ్యాన్నే ఏలుతున్న ముఖేష్ అంబానీ. దేశ ఎకానమీ ఈయన పై ఎంతగానో ఆధారపడి ఉంటుంది. భారత దేశాన్ని అభివృద్ధి పదంలో నడపాలనేదే ఈయన కల..! టెక్నాలజీ రంగంలో.. టెలికాం రంగంలో.. లైఫ్ స్టైల్ రంగంలో.. ఫ్యాషన్, డిజిటల్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రంగాల్లో ఈయనకి కంపెనీలు ఉన్నాయి. ప్రతీ కంపెనీ టాప్ లోనే ఉంటుంది. ఇప్పుడు ముకేష్ మన దేశం లోనే కాదు విదేశాల పైనూ కన్నెశారు..! ఇక అక్కడ కూడా మోత మ్రోగించడం ఖాయం అని అంటున్నారు వ్యాపార విశ్లేషకులు.

ప్రత్యర్థి కంపెనీలకు దిక్కుతోచని రీతిలో దెబ్బ కొడుతూ, తన వ్యాపారాన్ని విస్తరించుకుంటూ వెళుతున్నారు ముకేష్ అంబానీ. ఇటీవలే ముంబైలో జరిగిన సర్వసభ్య సమావేశంలో రిలయన్స్ సంస్థల చైర్మన్ ముఖేష్ అంబానీ ఆయన గతం లో ఆర్‌ఐ‌ఎల్ లో చేసిన లక్ష కోట్ల అప్పునీ త్వరలో తీరుస్తామని వెల్లడించారు. ఇలా వెల్లడించారు అంటే తన వ్యాపారాలు ఏ స్థాయిలో రన్ అవుతున్నాయో ఆలోచించుకోండి. ఇక ఆయన చేసిన వ్యాఖ్యలకి షేర్ మార్కెట్ లో షేర్ల సంఖ్య భారీగా పెరిగిపోయాయి. ఇన్వెస్టర్స్ కు పెద్ద ఎత్తున లాభాలు వచ్చాయి. టెలికాం రంగంలో ప్రైవేట్ ఆపరేటర్స్ కు చుక్కలు చూపిస్తోంది. ఫ్యాషన్ , జ్యుయెలరీ పై ఎక్కువగా కాన్సంట్రేషన్ చేస్తోంది.

బిజినెస్ అంటే కేవలం తన ఒక్కరి కంపెనీనే కాకుండా ప్రపంచ కంపెనీ వ్యవస్థ ని మొత్తం కంట్రోల్ చేయడం అనే లాజిక్ ఆయనది. తమ కంపెనీలనే కాకుండా ఇతర కంపెనీలు కూడా చేజిక్కించుకోవాలని ఆయన ప్లాన్ వేస్తున్నాడు. ఇందుకోసం పావులు కడుపుతున్నాడు. మార్కెట్ లోని పబ్లిక్ కంపెనీల షేర్ లలో 51 శాతం సొంతం చేసుకుంటే ఆ కంపెనీ తమ ఆధీనంలోకి వస్తుందని ముఖేష్ అంబానీకి తెలుసు. అందుకే భారీ పెట్టుబడులు పెట్టాలని ఇతర కంపెనీలని కూడా ఈయన సొంతం చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. గ్లోబల్ బ్రాండ్ లుగా ఉన్న కంపెనీలను చేజిక్కించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. దీని వల్ల కంపెనీ విలువ పెంచు కోవడం , దాని మేరకు బిజినెస్ విస్తరించడం, వాటాలు పొందేలా చూస్తోంది. రాబోయే రోజుల్లో ప్రపంచంలో రిలయన్స్ కంపెనీ తన బ్రాండ్ ఉండాలని, టాప్ రేంజ్ కు చేరుకోవాలని ఆరాటపడుతోంది. మరి చేరుకుంటుందా లేక చతికల పడుతుందా వేచి చూడాలి

Share.

Comments are closed.

%d bloggers like this: