తెలంగాణ బడ్జెట్ హిట్టా..? ఫట్టా..? కారణం సెంట్రలా..? స్టేటా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

దేశంలో ఆర్దిక పరిస్థితి సరిగా లేదు..! భారత ఎకానమీ రేటు బంగ్లాదేశ్ కన్నా పడిపోవడము చూసాము. మధ్యం లోపించడం విన్నాము. ఇక దాని ప్రభావం తప్పకుండా రాష్ట్రాల పై పడనుండి అని ఆర్దిక విశ్లేషకులు భావించారు. వారి అంచనాలకి ఏమాత్రం తగ్గకుండా అదే జరుగుతుంది. దేశ ఆర్దిక సంక్షోభంలో కొనసాగడం మూలాన దాని ఎఫెక్ట్ తెలంగాణ రాష్ట్రం పై పడిందని తెలంగాణ సీఎం కేసీఆర్ వెల్లడించారు. నేడు తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టిన సీఎం బడ్జెట్ లో లోపాలకీ కేంద్రమే కారణమని దేశ ఆర్దిక స్థితే కారణం అని స్పష్టం చేశారు. ఆర్థిక వృద్ధి రేటు తగ్గిన కారణంగా కేటాయింపులలో మార్పులు చేయడం జరిగిందన్నారు.

అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ 2019-20 వార్శిక బడ్జెట్ ని నేడు ప్రవేశపెట్టారు. దేశ ఆర్దిక సఙ్ఖోబాల కారణాన తెలంగాణ బడ్జెట్ కొంత తగ్గించాల్సి వచ్చిందని.. బడ్జెట్ కేటాయింపులలో కొన్ని మార్పులు చేయాల్సివచ్చిందని ఆయన తెలియజేశారు. ఎప్పటి లాగే పెన్షన్స్, రైతు బంధు పథకం, ప్రాజెక్టులు చేపడతామని వెల్లడించారు. వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు రావడం లేదన్నారు. విద్య, వైద్యం , తదితర రంగాలను కొనసాగిస్తామన్నారు. ఆటోమొబైల్, తదితర రంగాలు మూసి వేసే పరిస్థితుల్లో ఉన్నాయన్నారు.

ఈ ఏడాది ప్రతిపాదిత ఖర్చు కింద 1,46,492 రూపాయల కోట్లు గా తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టింది. రెవెన్యూ వ్యయం లక్షా 11 వేల కోట్లు , మూల ధనం విషయానికి వస్తే 17 వేల 274 కోట్లు గా పేర్కొన్నారు. ఇక మిగులు బడ్జెట్ అంచనా కింద 2 వేల 44 కోట్లు ఉన్నట్లు కేసీఆర్ తెలియజేశారు. ఆర్థికంగా లోటు 24 వేల కోట్లు దాటిందన్నారు. ఓటాన్ బడ్జెట్ ప్రతిపాదనలు లక్షా 82 వేల కోట్లుగా ఉండగా , ప్రస్తుతం వార్షిక బడ్జెట్ మాత్రం కొంచం తగ్గించి చూపించారు సీఎం.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రవేశ పెట్టిన ఆసరా పెన్షన్స్ కోసం 9 వేల 402 కోట్లు కేటాయించారు. గ్రామాల బలోపేతం కోసం 2 వేల 714 కోట్లు , రాబోయే ఎన్నికలు జరగబోయే మున్సిపాలిటీలకు 1764 కోట్లు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. 24 గంటల పాటు ఉచితంగా రైతులకు కరెంట్ ఇస్తున్నామని, విద్యుత్ సబ్సీడీలకు 8 వేల కోట్లు కేటాయించినట్లు స్పష్టం చేశారు. రైతు రుణాల మాఫీ చేసేందుకు గాను 6 వేల కోట్లు, రైతు బందుకు 12 వేల కోట్లు అదనంగా కేటాయించామని కేసీఆర్ చెప్పారు. భీమా కోసం 1250 కోట్లు కేటాయించామన్నారు.
కేసీఆర్ బడ్జెట్ లో పలు అంశాల గురించి అసలు ప్రస్తావననే తీసుకురాకపోవడాన్ని కొందరు తప్పుబట్టారు. గత కొన్నేళ్లుగా ప్రాధాన్యత కలిగిన ఉద్యోగాల భర్తీ విషయం గురించి వెల్లడించలేదు. కేసీఆర్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. సీఎం మాత్రం ఆర్దిక స్థితి సరిగా లేనప్పటికి నిధులు కేటాయించినట్టు చెబుతున్నారు.. ప్రతిపక్షాలు మాతరం బడ్జెట్ సరిగా లేదని బడ్జెట్ ప్రవేశ పెట్టడం లో కేసీఆర్ ఫెయిల్ అయ్యారని విమర్శలు చేస్తున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: