కర్ణాటకలో విషాదం..! నిమజ్జనంలో ఆరుగురు చిన్నారుల దుర్మరణం..!

Google+ Pinterest LinkedIn Tumblr +

కర్ణాటకలో ఘోర విషాదం జరిగింది. వినాయకుడి నిమజ్జనానికి వెళ్ళిన 6 గురు చిన్నారులు దుర్మరణం చెందారు…తిరిగిరాని లోకాలు వెళ్ళిపోయారు. ఈ విషాదం కర్ణాటక రాష్ట్రంలోని కేజీఎఫ్ తాలూకా లోని మరథఘట్ట గ్రామంలో జరిగింది. తల్లిదండ్రులకి నిమజ్జనానికి వెళ్లొస్తామని చెప్పి వెళ్ళిన చిన్నారులు తిరిగి మృతదేహాలుగా తమ ఇళ్ళకి వచ్చారు.. దీంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.. శోకసముద్రంలో మునిగిపోయారు తల్లిదండ్రులు. మరణించిన చిన్నారుల సంఖ్య 6 గురు కాగా చిన్నారులంతా 8 నుండి 12 ఏళ్ల లోగా వయసున్న వారే అని పోలీసులు తెలియజేశారు.

వివరాల్లోకి వెళితే కర్ణాటక రాష్ట్రంలోని కేజీఎఫ్ తాలూకా లోని మరథఘట్ట గ్రామానికి చెందిన 8 మంది చిన్నారులు తమ ఇళ్ళలో వినాయక నిమజ్జనానికి వెళ్లొస్తామని బయలుదేరారు. నిమజ్జనం చేసేందుకు ఆ ఊర్లో ఉన్న చెరువుకి వెళ్లారు. చెరువులోకి 6 గురు చిన్నారులు దిగి నిమజ్జనం చేస్తుండగా.. ఇద్దరు మాత్రం ఒడ్డున ఉంది చూస్తున్నారు. చేరులోకి దిగిన చిన్నారులు మునిగిపోతున్న విషయాన్ని పసిగట్టిన ఇద్దరు చిన్నారులు పరుగులు తీసి గ్రామస్తులకి తెలియజేశారు. కానీ సమయం అప్పటికే మించిపోయింది. మునిగిన చిన్నారులు అందరూ మరణించారు. స్థానికుల సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలని బయటకి తీసి దర్యాప్తు చేసుకున్నారు. మర్ణించిన వారిలో వైష్ణవి (12), ఆమె సోదరుడు రోహిత్ (10), తేజశ్రీ (11), ఆమె సోదరి రక్షిత (8), రోహిత్ (10), ధనుష్ (10)లు ఉన్నారు. విషయం తెలుసుకున్న సీఎం యడ్యూరప్ప తన సంతాపాన్ని తెలియజేసి మృతుల కుటుంబాలకి ఒక్కొకరికి 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించారు.

Share.

Comments are closed.

%d bloggers like this: