మాది భాగోతమా..? మమ్మల్ని చంపేస్తారా..? జగన్ పై బాబు ఫైర్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

చలో ఆత్మకూరు వైసీపీ బాధితులకి భరోసా తప్ప మరొకటి కాదని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. ఈ యాత్ర బాధితులకి భరోసా తెలియజేయడానికి చేస్తున్నామని.. ఎవరిపైనో యుద్ధం చేయడానికి కాదాని ఆయన తెలియజేశారు. ఏపీలో అరాచక పాలనకి చరమగీతం పాడేందుకే ఈ పోరాటమని ఆయన పేర్కొన్నారు. వైసీపీ ది అప్రజాస్వామిక పాలన అని దౌర్జన్య పాలన అని ఆ దౌర్జన్యాలకి బలి అయిన బాధితులకి అండగా నిలిచేందుకే తాము పోరాటం చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా దౌర్జన్యాలు చేసినా తమ పోరాటం ఆగదని ఆయన తెలియజేశారు. వైసీపూ దాడుల పై ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే న్యాయపోరాటం చేసేందుకు కూడా సిద్ధమని బాబు మంగళవారం సాయంత్రం గుంటూరు పార్టీ కార్యాలయంలో పేర్కొన్నారు.

ఆయన మాట్లాడుతూ.. ఏపీ లో వైసీపీ ప్రభుత్వానికి వచ్చిన తరువాతా ఎన్నో దాడులకి దౌర్జన్యాలకి పాల్పడిందని బాబు అన్నారు. ఆ దాడులకి ప్రజలు ఇంకా కొల్కోలేదని తెలియజేశారు. అందుకు సతమతమైన బాధితులకి తాము అండగా నిలిచేందుకు పోరాటం చేస్తున్నామని ఆయన తెలియజేశారు. వారు చేసిన దాడులపై ఇప్పటికే 2 పుస్తకాలు విడుదల అయ్యాయి ఇంకా ఎన్ని విడుదల అవ్వాలో అని బాబు విమర్శలు గుప్పించారు.. బాధితుల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో ఉన్న వాళ్ళంతా పెయిడ్ ఆర్టిస్టులే
అని హోంమంత్రి చేసిన వ్యాఖ్యలకి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

ఎవరు పెయిడ్‌ ఆర్టిస్టులో.. ఎవరు మొసలి కన్నీరు కారుస్తున్నారో.. ప్రజలే చూస్తున్నారు వారిగి ప్రజలే గుణపాఠం చెబుతారని ఆయన వ్యాఖ్యానించారు. అధికారం ఉంది కదా అని ఇష్టానుసారంగా నోటికొచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదు అని బాబు హితువు పలికారు. తన రాజకీయ జీవితంలో ఇటువంటి అనైతిక దురుసు పాలనని ఎప్పుడూ చూడలేదని రాజకీయాన్ని హీనస్థితికి తీసుకెళ్లిన ఘనత వైసీపీ కీ ఉండిపోతుందని మండిపడ్డారు.

పల్నాడులో 144 సెక్షన్ పెట్టారని.. బీజేపీ నేతలు వెళుతుంటే 144 సెక్షన్‌.. వైసీపీ నేతలకు 144 సెక్షన్‌ వర్తించదా అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం వారి చేతుల్లో ఉంది కదా అని వాళ్ళు చెబితే మమ్మల్ని చంపేస్తారా అంటూ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. సేవ్‌ పల్నాడు పేరుతో సీఎం, హోంమంత్రి ఫొటోలు పెట్టుకున్నారు.. మీది ఊరేగింపు.. మాది బాధితుల గోడు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితులు ఇప్పటికే చాలా అనుభవించారని వారిని అక్కడనుండి తీసుకెళితే అస్సలు సహించేది లేదని బాబు స్పష్టం చేశారు.

Share.

Comments are closed.

%d bloggers like this: