నిరాహార దీక్షకి దిగిన బాబు..! హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు..! ఉద్రిక్తం..

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వైసీపీ నాయకుల దాడులకి బాధితులైన వారికి అండగా నిలుస్తూ చేపడుతున్న ఛలో ఆత్మకూరు ఇప్పుడు రాజకీయంగా రచ్చలా మారింది. రాష్ట్రం అంతటా గందరగోళ పరిస్థితికి తెర తీసింది. బాబు చేస్తున్న యాత్రని అడ్డుకోవాలని వైసీపీ కుట్ర చేస్తోంది. పునరావాస కేంద్రంలో ఉన్న బాధితులంతా పెయిడ్ ఆర్టిస్టులు అంటూ.. వ్యాఖ్యలు చేయడమే కాకా వారందరినీ అక్కడ నుండి తరిమెండుకు సన్నాహాలు చేస్తుంది. మరోపక్క మీరు ఏం చేసినా ఎంత దిగజారినా.. మా పోరాటం ఆగదు..! ప్రజలకు అండగా నిలిచే ఈ కార్యక్రమాన్ని మీరు ఎన్ని అడ్డంకులు వేసినా మేము ప్రోయోగాత్మకంగా ఎదుర్కుంటామని.. ఎట్టి పరిస్థితిలో ఆపమని హితువు పలుకుతున్నారు.

రాష్ట్రంలో పలు చోట్ల 144 సెక్షన్ అమలు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. పోలీసులు ప్రజలని తరిమేయడం దాదాపుగా ప్రారంభించేశారు. అడ్డొచ్చే నేతలపైను తమ ప్రతాపం చూపుతున్నారు. గుంటూరు పార్టీ కార్యలయంలో ఉన్న చంద్రబాబు ఎట్టి పరిస్థితిలో కార్యక్రమం నిలిపివేయమని చెబుతున్నారు. పోలీసులు తనని బయటకి రాకుండా గృహ నిర్బంధం చేసినందుకు గాను ఆయన ఈరోజు రాత్రి 8 గంటల వరకు నిరాహారా దీక్షకి దిగుతానని తేల్చి చెప్పారు. తనని ఎక్కడుంచినా ఏం చేసినా ప్రజల గురించి చేసే పోరాటం మాత్రం ఆపమని ఆయన స్పష్టం చేశారు. ఇక పోతే చంద్రబాబు ఇంటి వద్ద కూడా పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. అక్కడున్న మాజీ మంత్రి నారా లోకేశ్ ని కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడంతో ఇలాంటి పరిస్థితి నెలకొంది.

Share.

Comments are closed.

%d bloggers like this: