పెళ్ళికి వెళ్ళిన జనంపై వైసీపీ దొరల దౌర్జన్యం..! బాధితులు అయోమయం..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆంధ్రను వైసీపీ దొరల దౌర్జన్య పాలన నుండి విముక్తులని చేసేందుకు.. వైసీపీ దాడుల బాధితులకి అండగా నిలిచేందుకు ఛలో ఆత్మకూరు అనే కార్యక్రమంతో ముందుకు దూసుకుపోతున్నారు చంద్రబాబు. చంద్రబాబుకి మద్దత్తు తెలుపేందుకు జనం తరలి వస్తున్నారు.. సహించలేని వైసీపీ నాయకులు ఎన్ని ఎత్తులు పన్నినా ఎన్ని దౌర్జన్యాలు చేస్తున్నా జనసంద్రం మాత్రం బాబు చెంతే ఉంది. ఇప్పటికే 144 సెక్షన్ అమలు చేసి నిరంకుశ పాలన తో జనాన్ని తరుముతున్నారు.. పోలీస్ జులుం ని అడ్డు పెట్టుకొని జనాన్ని చిత్రహింసలకి గురిచేస్తున్నారు.. నేతలని అధినేతలనీ హౌస్ అరెస్ట్ చేస్తున్నారు.

ఇది ఇలా ఉంటే.. చంద్రబాబు కార్యక్రమానికి మద్దత్తుగా వెళుతున్నారు అని తాలిచి ఎవ్వరిని పడితే వారిని చితకబాదుతున్నారు ఖాకీలు..! దీంతో గుంటూరు ప్రజలంతా భయబ్రాంతులకు గురవుతున్నారు. పెళ్లి సందడిలో మునిగున్న ఓ కుటుంబం అంతా కలిసి గుంటూరు లోని అరుందోల్ పేట కి వెళుతున్నారు. ఇక వీరిని చూసిన పోలీసులు చంద్రబాబు కార్యక్రమానికి మద్దత్తుగా వెళుతున్నారేమో అని ఫిక్స్ అయ్యి వారిని అక్కడే ఆపేశారు.. మేము పెళ్ళికి వెళుతున్నామని వారు ఎంత చెప్పినా పోలీసులు పట్టించుకోలేదు..పెళ్లి కార్డ్ ని చూపించినప్పటికీ అదే వైనం ఎంత మొర పెట్టుకున్నా పట్టించుకొని పరిస్థితి. వారు చెప్పింది వినకపోగా వారి పై దాడి చేశారు, కొందరిని చితకబాదారు. స్థానికీ పోలీస్ స్టేషన్ లో వారిని బందించారు. తమ నాయకుడు ఏది చెపితే అది చేస్తున్నారని బాబు అన్నట్టుగా వాళ్ళ నాయకుడు చెబితే చంపేస్టరేమో అనే పరిస్థితే నిజం అయ్యిందని బాధితులు వాపోతున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: