పాక్ కుట్రలు ఫ్లాప్..! ప్రపంచం అంతా భారత్ వెంటే ఉంది..!

Google+ Pinterest LinkedIn Tumblr +

భారత్ పాకిస్తాన్ పరస్పర దేశాల మధ్య కాశ్మీర్ అనే సమస్య ఎన్నో ఏళ్లుగా సాగుతోంది. అది ఇప్పుడు తారా స్థాయికి చేరుకుంది. ఇరు దేశాల మధ్య సంబంధాలు పచ్చ గడ్డి బగ్గుమానే లా మారాయి. తీవ్రవాదంతో భారత్ ను వణికించాలనే ప్రయత్నం చేస్తున్నారు కానీ మన జవాన్లు తగిని సమాధానం చెబుతున్నారు.. రోజు వందల కొద్ది మృత్యు సంబందిత వార్తలు వినాల్సొస్తుంది. కేవలం యుద్ధం తప్పా అన్నీ జరుగుతూనే ఉన్నాయి.. భారత్ పై తీవ్రవాద దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఆ దేశ ప్రధాని తమ దేశంలో తీవ్రవాదం తారా స్థాయి లో ఉందని చెబుతూనే శాంతి సంయమనం పాటించాలని నీతిసూక్తులు పలుకుతున్నారు. తమ దేశం లోని తీవ్ర వాదాన్ని కంట్రోల్ చేయడం తెలియని ఆయన భారత్ నే బెధిరిస్తున్నారు. యుద్ధానికి సిద్ధం అని హితువు పలుకుతున్నారు.

పాకిస్తాన్ నిత్యం కారాలు మిర్యాలు నూరుతూనే ఉంది. తమ వద్ద అను శక్తి ఎక్కువగా ఉందని చైనా తో మంచి సంబంధం ఉందని విర్రవీగుతున్నారు. కాశ్మీర్ పై పదే పదే ఆరోపణలు చేస్తున్న పాక్ అంతర్జాతీయ స్థాయిలో ఒంటరిగా మిగిలింది. ఒక్క చైనా దేశం మినహా ఏ దేశమూ పాక్ కు మద్దతు ప్రకటించలేదు. అగ్ర రాజ్యాలు అమెరికా, రష్యా సైతం భారత్ కు, మోడీకి మద్దతు తెలిపాయి. దీంతో ఎటూ పాలుపోని పరిస్థితుల్లో కయ్యానికి కాలు దువ్వుతోంది పాక్. రా రమ్మంటూ పిలుస్తోంది. అయితే ఎప్పుడైతే భారత ఆంతరంగిక భద్రతా సలహాదారుగా అజిత్ దోవల్ బాధ్యతలు తీసుకున్నారో ఇక అప్పటి నుంచి పాకిస్థాన్ లో వణుకు మొదలైంది. దీంతో వాస్తవాధీన రేఖ వెంట పాకిస్థాన్ తన బలగాలను మోహరించింది. జమ్మూ, కాశ్మీర్ లో రెడ్ అలర్ట్ ప్రకటించింది ఇండియా.

ఐబీ సమాచారం మేరకు భారత్ లో రానున్న రోజుల్లో పాకిస్తాన్ కుట్రలు పెరుతాయని తెలుస్తుంది. కాశ్మీర్ లో స్పెషల్ స్టేటస్ కొనసాగించాలని పాకిస్థాన్ పట్టుపడుతోంది. అయితే వాస్తవానికి పాకిస్థాన్ లో తీవ్ర ఆర్ధిక సంక్షోభం నెలకొన్నది. ఉగ్రవాదులు, దాడులు, నిత్యం ఇబ్బందుల మధ్య సర్కార్ నడుస్తోంది. దీనిని కప్పి పుచ్చుకునేందుకు ఇమ్రాన్ ఖాన్ కొత్త నాటకానికి శ్రీకారం చుట్టారు. అయితే మసూద్ అజర్ ను అరెస్ట్ చేశామని , అనారోగ్యంతో బాధ పడుతున్న అజర్ ను జైల్లోనే ట్రీట్ మెంట్ ఇస్తున్నామని చెప్పిన పాక్ మాటలు ఉత్తివేనని తేలిపోయింది. జైషే మహమ్మద్ సంస్థని అడ్డం పెట్టుకొని తీవ్రవాదాన్ని పెంచాలని పాకిస్తాన్ భావిస్తునట్టు అందుకే అంతర్జాతీయ తీవ్రవాది మసూద్ అజహర్ ను విడుదల చేశారని ఐబీ ప్రకటించింది. ఐబీ సమాచారం తో తగిన వ్యూహాలతో దోవల్ సిద్ధంగా ఉన్నారని పాక్ ఆటలు ఇక సాగవని తెలుస్తుంది.

Share.

Comments are closed.

%d bloggers like this: