లీటర్ పాలు రూ.140..ఎక్కడంటే..?

Google+ Pinterest LinkedIn Tumblr +

మన దేశంలో పెట్రోల్ ధరలు పెరుగిపోతుంటే…పాకిస్తాన్‌లో మాత్రం పాల ధరలు మండిపోతున్నాయి. ఇంకా చెప్పాలంటే పాకిస్తాన్ లో పాల ధరతో పోలిస్తే మన దేశంలో పెట్రోల్ ధర సగం ఉంటుంది. అయితే మొహార్రం సందర్భంగా మంగళవారం పాకిస్థాన్‌లో లీటర్ పాలను రూ.140కి విక్రయించారు. కరాచీలో పాలకు డిమాండ్ అధికంగా ఉండటంతో.. పెట్రోల్, డీజిల్ కంటే ఎక్కువ ధరను పెట్టి మరీ పాలను కొనాల్సి వచ్చింది. పాకిస్తాన్‌లో లీటర్ పెట్రోల్ రూ.113 కాగా, డీజిల్ రూ.91కి విక్రయిస్తున్నారు. వాస్తవానికి లీటర్ పాలను గరిష్టం రూ.94కే విక్రయించాలని ప్రభుత్వం ఆదేశించింది. రిటైల్ ధరను రూ.110గా నిర్ణయించారు. కానీ దుకాణదారులు లీటర్ రూ.140 చొప్పున పాలను విక్రయించారు. మొహర్రం సందర్భంగా దైవ సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొనే వారి కోసం రోడ్ల పక్కన దుకాణదారులు పెద్ద ఎత్తున పాలు, పండ్ల రసాలు, మంచి నీళ్లు వంటివి ఏర్పాటు చేస్తుంటారు. దీంతో పాల డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. డిమాండ్‌కు తగ్గట్టుగా పాలు అందుబాటులో లేకపోవడంతో ధర పెరిగింది. ‘మేం ప్రతి సంవత్సరం మొహర్రం సందర్భంగా ఇలా పాలు ఇస్తుంటాం. ధరలు పెరిగినా సరే మేం ఆనవాయితీని కొనసాగించాం. నా జీవితంలో పాల రేటు ఇంతగా ఉండడం ఎప్పుడూ చూడలేదు.’ అని ఓ దుకాణదారు తెలిపాడు. పాల ధరను నియంత్రించడానికి కరాచీ కమిషనర్ డాక్టర్ ఖటూ మల్ జీవన్ చర్యలేవీ తీసుకోవడం లేదనని వాపోతున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: